రాత్రిపూట పీకలదాకా తాగడం... ఆ మత్తు పొద్దునదాకా వదలక తలనొప్పితో బాధపడటం... ఈ సమస్య ఈ మధ్యకాలంలో చాలా మంది యువత ఫేస్ చేస్తున్నారు. ముఖ్యంగా వీకెండ్ వచ్చిదంటే చాలు... చాలా మంది పబ్బుల్లోనే మునిగి తేలుతుంటారు. శని, ఆది విపరీతంగా తాగేసి... ఆ మత్తును సోమవారం కూడా క్యారీ చేసేస్తుంటారు. కానీ ఎంత మత్తు ఉన్నా.. తలనొప్పి ఉన్నా... తర్వాతి రోజు ఆఫీసుకు వెళ్లక తప్పదు. ఇలాంటి సమస్యను తమ కంపెనీ ఉద్యోగులకు మాత్రం కలగకూడదు అనుకుంది ఓ సంస్థ. అందుకే వాళ్ల కోసం హ్యాంగోవర్ లీవ్స్ ని తీసుకువచ్చింది.

కెనడాకి చెందిన ఓ మల్టీ నేషనల్ కంపెనీ ఈ బంపర్ ఆఫర్ తీసుకువచ్చింది. ఇంతకీ ఆ కంపెనీ ఈ బంపర్ ఆఫర్ ఎందుకు ఇచ్చిందో తెలుసా...? చాలా మంది ఉద్యోగం హ్యాంగోవర్ తో ఆఫీసుకు వచ్చినా సరిగా పనిచేయడం లేదట. చేసినా కూడా తప్పులు చేయడం... ఇతరులపై చిరాకు పడటం లాంటివి చేస్తున్నారట. ఇంకొందరేమో మద్యం మత్తులో యాక్సిడెంట్స్ చేస్తున్నారట. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చెప్పేందుకే ఈ కొత్త రకం సెలవులను ప్రవేశపెట్టారు.

మరి తాగుడు అలవాటు లేని వారి పరిస్థితి ఏంటి అంటే... వాళ్లు కూడా ఈ సెలవులను వాడుకోవచ్చట. రాత్రిపూట ఏదైనా పని ఉండి నిద్ర లేక పోయినా... ఆ తర్వాతి రోజు ఈ సెలవు వాడుకొని... ఇంట్లో హాయిగా నిద్రపోవచ్చు . లేదంటే... ఇంటి నుంచి వర్క్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఇప్పుడు ఈ కంపెనీ ఇస్తున్న ఈ లీవ్... ఆ కంపెనీ ఉద్యోగులకు తెగ కిక్కు ఇస్తోందట. దీనికి సంబంధించిన వార్త కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అబ్బ...ఇలాంటి లీవు మా కంపెనీలో పెడితే కూడా బాగుంటుంది కదా అని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.