Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరులో రూ. 6కే ఉబర్ క్యాబ్.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మహిళ ట్వీట్..

బెంగళూరులో ఉంటున్న ఒక మహిళకు కేవలం రూ. 6కి ఉబెర్ రైడ్‌ను దొరికింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ను ఆమె ట్విట్టర్ లో షేర్ చేసింది.  

Uber cab for Rs. 6 in Bengaluru, Woman Shares ride receipt goes viral on social media - bsb
Author
First Published Aug 17, 2023, 4:00 PM IST

బెంగళూరు : బెంగళూరు పేరు వినగానే ట్రాఫిక్ రద్దీ గుర్తుకువస్తుంది. మామూలు రోజుల్లో భయంకరమైన ట్రాఫిక్ రద్దీకి బెంగళూరు ప్రసిద్ధి చెందింది. రద్దీ సమయాల్లో ఉదయం ప్రయాణమైనా లేదా సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే సమయమైనా, రోజువారీ ప్రయాణం బెంగళూరులో సవాల్ గా ఉంటుంది. 

ఈ భయంకరమైన ట్రాఫిక్ కు తోడు నగరంలో క్యాబ్ సర్వీస్‌లు కూడా అధిక రేట్లు బాదుతుంటాయి. అయితే, ఒక మహిళకు మాత్రం ఓ ఆశ్యర్యకరమైన అనుభవం ఎదురయ్యింది. కేవలం రూ. 6కి ఉబెర్ రైడ్‌ను దొరికిందని తన సంతోషాన్ని ట్విట్టర్ లో షేర్ చేసింది. ఈ పోస్ట్ సోషల్ మీడియా వినియోగదారులను, ముఖ్యంగా బెంగళూరులో వాసులను ఆశ్చర్యానికి గురి చేసింది.

తను క్యాబ్ కు చార్జ్ చేసిన రూ. 6 చూపే స్క్రీన్‌షాట్‌ను కూడా ట్విట్టర్ లో ఆమె పోస్ట్ చేసారు. అసలు మొత్తం రూ. 46.24. కాగా, ప్రమోషనల్ కోడ్‌ వాడడంతో ఈ ఛార్జీ రూ.6కి తగ్గింది. అయినప్పటికీ, ఇంత తక్కువ ధర బెంగళూరు వాసులకు అరుదైన సంఘటన.

ఊహించినట్లుగానే, ఈ క్యాబ్ రైడ్ ఛార్జీలతో సోషల్ మీడియా ఆశ్చర్యపోయింది. ఈ ఛార్జీలు, ముఖ్యంగా నగరంలో రద్దీ సమయాల్లో విపరీతమైన ధరల పెరుగుదలను అనుభవించిన బెంగళూరు వాసులు నమ్మలేకపోతున్నారు. 

దీంతో ఈ పోస్ట్ కు అపారమైన జనాదరణ వచ్చింది. ఈ పోస్ట్ కు వెంటనే 50,000 వ్యూస్ వచ్చాయి. చాలామంది దీనిమీద కామెంట్స్ కూడా పెట్టారు. ఒకరు కామెంట్ చేస్తూ... "తమాషా విషయం ఏంటంటే.. నాకూ నిన్న ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. నా రైడ్ మీద 35% తగ్గింపు లభించింది. దీంతో ధర సున్నాకు చేరుకుంది. నా రైడ్‌ను ఏ డ్రైవర్ అంగీకరించలేదని చెప్పనవసరం లేదనుకుంటా" అని ఒకరు వ్యాఖ్యానించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios