Asianet News TeluguAsianet News Telugu

ఆడ పాము కోసం రెండు కొండ చిలువల కొట్లాట.. ఇంట్లో సీలింగ్ వేలాడుతూ..

అందులోనూ ఆ రెండు పాములు పెద్ద పెద్ద కొండ చిలువలు. బాగా లావుగా కూడా ఉన్నాయి. వాటిని చూసి అతనికి వెంటనే భయం వేసింది.

Two Large Pythons Crash Through Ceiling. They Were Fighting Over A Female
Author
Hyderabad, First Published Sep 2, 2020, 2:39 PM IST

కళ్ల ముందు పాము పాకుతూ కనిపిస్తేనే కొద్దిసేపు గుండె ఆగినంత పని అవుతుంది. అలాంటిది రెండు పెద్దపెద్ద కొండ చిలువలు ఇంట్లోకి వెళ్లగానే.. ఆ ఇంటి సీలింగ్ కి వేలాడుతూ.. ఒకదానితో మరొకటి కొట్టుకుంటుంటే.. ఎలా ఉంటుంది. పై ప్రాణం పైనే పోతుంది కదా. ఇలాంటి సంఘటనే ఓ వ్యక్తికి ఎదురైంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ కి చెందిన ఓ వ్యక్తి పనిమీద బయటకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి తన కిచెన్ సీలింగ్ నుంచి రెండు పెద్ద పాములు వేలాడుతూ కనిపించాయి. అందులోనూ ఆ రెండు పాములు పెద్ద పెద్ద కొండ చిలువలు. బాగా లావుగా కూడా ఉన్నాయి. వాటిని చూసి అతనికి వెంటనే భయం వేసింది.

ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశాడు. కాగా.. వెంటనే పాములు పట్టేవారికి సమాచారం అందించాడు. వాళ్లు వచ్చి.. ఆ రెండు పాములను పట్టుకున్నారు. అయితే.. ఆ పాములను పట్టుకున్న వ్యక్తి వాటిని ఫోటోలు తీసి.. సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అయ్యింది. ఆ పాములు... రెండు మగవి కాగా.. మరో ఆడ పాము కోసం కొట్టుకుంటున్నట్లు ఆయన చెప్పాడు.

 

అయితే.. ఆ ఆడపాము మాత్రం దొరకలేదట. దానికోసం వెతుకుతున్నట్లు చెప్పాడు. తాను చాలా పాములు పట్టుకున్నానని.. కానీ అంత పెద్ద, లావు పాములను మాత్రం పట్టుకోలేదని చెప్పాడు. ఒక పాము 9.5 అడుగుల పొడవు ఉంటే.. మరో పాము 8 అడుగులపైనే ఉందని చెప్పాడు. వాటిని పట్టుకొని అనంతరం అడవిలో వదిలేసినట్లు చెప్పాడు. ఆ రెండు పాములు కొట్టుకునే సమయంలో భారీగా కడుపునిండా తిని ఉన్నాయని చెప్పాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios