భయానకం.. ఆకాశంలోకి ఎగరగానే విరిగిపడ్డ విమానం తలుపులు..

ప్రయాణీకులు తీసిన వీడియోలలో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుండి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తుంది.

Terrifying.. doors of the plane broke as soon as it flew into the sky - bsb

న్యూఢిల్లీ : అలాస్కా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737-9 MAX విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే గాలిలో ఒక తలుపు తెరుచుకుంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనలకు లోనయ్యారు. ప్రయాణీకులు తీసిన వీడియోలలో మిడ్ క్యాబిన్ ఎగ్జిట్ డోర్ విమానం నుండి పూర్తిగా విడిపోయినట్లు కనిపిస్తుంది.

"AS1282 విమానం పోర్ట్‌ల్యాండ్ నుండి కాలిఫోర్నియాలోని అంటారియోకు బయలుదేరిన వెంటనే ఈ సంఘటన జరిగింది. విమానం 171 మంది ప్రయాణికులు, 6 మంది సిబ్బందితో పోర్ట్‌ల్యాండ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా తిరిగి ల్యాండ్ అయింది. ఏం జరిగిందో పరిశీలిస్తున్నాం. అవి తేలిన తరువాత మరిన్ని వివరాలు తెలుపుతాం అని.. అలాస్కా ఎయిర్‌లైన్స్ ఒక ట్వీట్ లో పేర్కొంది.

యూఎస్ నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ ఎక్స్ లో చేసిన ఓ పోస్ట్‌లో అలాస్కా ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 1282కి సంబంధించిన ఈవెంట్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిపింది. విమానం 16,325 అడుగుల ఎత్తుకు పోయిన తరువాత ఇది జరిగింది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది విమానాన్ని తిరిగి పోర్ట్‌ల్యాండ్‌కి మళ్లించారు. సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపారు.

ఘటన జరిగిన బోయింగ్ 737 ఎంఏఎక్స్ అక్టోబరు 1, 2023న అలాస్కా ఎయిర్‌లైన్స్‌లో చేరింది. నవంబర్ 11, 2023నుంచి వాణిజ్య సేవలో ఉంది.  737-9 MAX విమానం రెక్కల వెనుక క్యాబిన్ నిష్క్రమణ తలుపు దగ్గర ఈ ఘటన జరిగింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios