Asianet News TeluguAsianet News Telugu

మహిళ చేతిమీద మొలిచిన ముక్కు... దీనివెనుక పెద్ద కథే ఉంది.. అదేంటో తెలుసా??

ఓ మహిళ చేతి మీద ముక్కు మొలిపించుకుంది. కావాలనే పట్టుబట్టి మరీ చేసింది. దీనికి వైద్యులు కూడా సహకరించారు. వింటుంటే ఆశ్చర్యంగా ఉందా.. ఈ స్టోరీ చదివితే మీరూ మంచిపనే చేసింది అంటారు. 

Surgeons Successfully Transplant Nose Grown On Woman's Arm To Her Face In France
Author
First Published Nov 12, 2022, 12:07 PM IST

ఫ్రాన్స్ : చేతి మీద ముక్కు అనే వార్త చూడగానే… ఇదేదో ఫేక్ న్యూస్ అని కొందరు, అదేమీ ఉండదు అక్కడేదో బొమ్మ గీసుకొని ఇలా న్యూస్ క్రియేట్ చేసి ఉంటారని మరి కొందరు అనుకుంటారు. కానీ ఇది ఫేక్ న్యూస్ కాదు, ఏదో సరదాగా చేసిన విషయం అంతకంటే కాదు..  ఓ మహిళ నిజంగానే తన చేతి మీద ముక్కును పెంచుకుంది. అదెలా సాధ్యమని అంటారా.. వైద్యుల ప్రయత్నం వల్ల ఇది సాధ్యపడింది. దీనికోసం చాలా కష్టపడ్డారు వాళ్లు. ఆ మహిళ ఇలా చేయడం వెనుక చాలా పెయిన్ ఉంది. 

ఆల్రెడీ ముఖం మీద ఒక ముక్కు ఉంటే మళ్లీ కొత్త ముక్కు చేతిమీద పెంచుకోవడం ఏమిటీ? అని బుగ్గలు నొక్కుకునేవారు ఉండనే ఉంటారు. అలాంటి వారి అనుమానాలకు సమాధానం దొరకాలంటే ఇది చదవాల్సిందే.  ఫ్రాన్స్ కు చెందిన ఒక మహిళ నాసికా కుహర క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతుంది.  వైద్యులు  ఆమెకు ఎన్ని రకాలు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. ఆమెకు రేడియోథెరపి, కీమోథెరపి చికిత్స కూడా అందించారు. అయితే ఈ చికిత్సలు విజయవంతం కాలేదు.  అంతేకాదు ఈ చికిత్సల వల్ల ఆమె తన ముక్కు ఆకారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.  

ఆఫ్గనిస్తాన్‌లో ఆడపిల్లలకు కొత్త రూల్ : పార్కులు, జిమ్‌లలోకి మహిళలకు నో ఎంట్రీ.. తాలిబన్ల హుకుం

దాంతో వైద్యులు ఆమె ముక్కును ఇదివరకటిలా మార్చేందుకు వివిధ చికిత్సలతో తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వారు అనుకున్నది సాధించలేకపోయారు. అప్పుడే వైద్యులు వైద్యరంగంలో ఉన్న టెక్నాలజీని ఉపయోగించి సదరు మహిళ చేతిమీద ముక్కునే సృష్టించారు. దీనికోసం మృదులాస్థి స్థానంలో త్రీడీ ప్రింట్ బయోమెటీరియల్ ఉపయోగించడంతో పాటు దానికి ఆమె కణితి భాగం నుంచి చర్మాన్ని సేకరించి అమర్చారు. వీరి ప్రయత్నం ఫలించి మహిళ చెయ్యి మీద ముక్కు మెులిచింది. దీనికి సంబంధంచిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios