ఈ ఫోటోలో ఉన్న కుక్కని చూశారా..? అచ్చం పులిలాగా ఉంది కదా. అది అలా పులి లాగా కనపడటానికి దాని ఒంటికి రంగులు వేశారు. అయితే.. సరదాగా చేసిన ఈ పని ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. ఈ సంఘటన మలేషియాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మలేషియాలో ఓ వీధి కుక్కకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇదిగో ఇలా పులిలాగా రంగులు వేశారు. అయితే.. దానిపై విమర్శలు వ్యక్తమౌతున్నాయి. మలేషియా జంతు సంరక్షణ సంఘం దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలా కుక్కకి పులిలాగా రంగులు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ మండిపడుతున్నారు.

జంతు సంరక్షణ సంఘానికి చెందిన సభ్యులు ఇలా చేసిన వారి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ఇలా రంగులు వేయడం వల్ల కుక్కలకు చాలా ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు. కాగా.. దీనిపై అధికారులు సైతం స్పందించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. ఈ కుక్క ఎవరిదో చెప్పాలని అధికారులు కోరుతున్నారు.

ఈ విమర్శలు.. వివాదాలు పక్కన పెడితే.. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. 3వేలకు పైగా మంది ఈ ఫోటోని షేర్ చేశారు. కుక్క అచ్చం మినీ టైగర్ లా ఉందంటూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు.