Asianet News TeluguAsianet News Telugu

నాన్న కోసం చిన్నారి కంటతడి... వైరల్ వీడియో వెనక కథ ఇదే..!

ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి శబరిమల వచ్చాడు. అయితే,  విపరీతమైన రద్దీ కారణంగా చాలా మంది యాత్రికులు అయ్యప్ప దర్శనం పొందకుండానే పందళం నుండి తిరిగి వెళ్లిపోతున్నారు. 

story behind kid crying viral video in sabarimala ram
Author
First Published Dec 14, 2023, 11:10 AM IST


శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి ఈ సమయంలో భక్తులు పోటెత్తూ ఉంటారు. ఇప్పటికే.. అక్కడ భక్తుల రద్దీ గురించి మనకు చాలా వార్తలు  వస్తూనే ఉన్నాయి. ఈక్రమంలోనే నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసి చాలా మంది కంటతడి కూడా పెట్టేశారు. తన తండ్రి కోసం ఓ చిన్నారి బాలుడు ఏడుస్తూ, అందరినీ ప్రాధేయపడుతున్న వీడియో ఇది. ఇప్పుడు ఆ వీడియో చూసినా, బాధగానే అనిపిస్తుంది. అసలుు అక్కడ జరిగింది ఏంటి..? ఆ వీడియో తర్వాత జరిగింది ఏంటో కూడా ఓసారి చూద్దాం..

ఇంతకీ ఆ వీడియోలో అసలు ఏం జరిగిందంటే... ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్, జనవరి సమయంలో అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తుతూ ఉంటారు. ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి శబరిమల వచ్చాడు. అయితే,  విపరీతమైన రద్దీ కారణంగా చాలా మంది యాత్రికులు అయ్యప్ప దర్శనం పొందకుండానే పందళం నుండి తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ బాలుడు బస్సలో ఉన్నాడు. ఆ బస్సు కూడా ఫుల్ రష్ గా ఉంది. అంత మందిలో ఆ బాలుడికి తన తండ్రి కనిపించలేదు. దీంతో గట్టిగా ఏడ్చేశాడు. బస్సు కదులుతోందని, తన తండ్రి పక్కన లేడని చాలా గట్టిగా ఏడుస్తాడు.  కిటికీలో నుంచి చూస్తూ.. కింద ఉన్న పోలీసులను కూడా వేడుకున్నాడు. నాన్న కావాలి అంటూ ఆ బాలుడు ఏడ్చిన వీడియో... సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఆ వీడియో తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం బయటకు రాలేదు. కానీ, ఆ బాలుడి తండ్రి కూడా అదే బస్సులోనే ఉన్నాడట. అంత మందిలో ఆ బాబుకి కనపడలేదు అంతే. కాసేపటికే ఆ బాబుకి వాళ్ల నాన్న కనిపించాడట. ఆ బాలుడిని వాళ్ల నాన్నకు అప్పగించేశారట. వాళ్ల నాన్న కనిపించిన తర్వాత ఆ బాబు సంతోషంతో చిందులు వేశాడు. అక్కడి పరిస్థితిని జస్ట్ కొన్ని నిమిషాల్లోనే పోలీసులు కంట్రోల్ చేయడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios