Asianet News TeluguAsianet News Telugu

ట్రాఫిక్ ఉల్లంఘన.. సోషల్ మీడియా స్టార్ హస్బుల్లా అరెస్ట్.. వీడియో వైరల్..

ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ఫ్లుయేన్సర్ హస్బుల్లా అరెస్టయ్యాడు. ట్రాఫిక్ ఉల్లంఘనల కింద పోలీసులు అతడిని, అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.  

Social Media Star Hasbulla Arrested For Violating Traffic Laws - bsb
Author
First Published May 9, 2023, 4:20 PM IST

అతను సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారినప్పటినుంచి హస్బుల్లా వైరల్ అవుతున్నాడు. సోషల్ మీడియాలో నెటిజన్లు అత్యంత ఇష్టపడే సెలబ్రిటీలలో ఒకరు హస్బుల్లా. అయితే, ఈ పాపులారిటీ చట్టాన్ని ఉల్లంఘించకుండా ఆపలేకపోయింది. 

తాజా నివేదికల ప్రకారం, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయేన్సర్ అయిన హస్బుల్లా తన స్నేహితులతో కలిసి ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినందుకు గానూ డాగేస్తాన్‌లో అరెస్టయ్యాడు.

రష్యన్ సోషల్ మీడియా సెలబ్రిటీ అయిన హస్బుల్లా ఒక జన్యుపరమైన రుగ్మతతో బాధపడుతున్నాడని తెలిసిందే. దీనివల్ల అతని శరీరం గ్రోత్ హార్మోన్‌ను ఉత్పత్తి చేయలేకపోయింది. దీనివల్ల అతను తన వయసు వారికంటే పొట్టిగా ఉండిపోయాడు. అతన్నిచాలామంది చిన్న పిల్లడనే అనుకుంటారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, వైరల్ స్టార్ నిజానికి యువకుడు. కొద్ది రోజుల్లో 21వ పుట్టినరోజు జరుపుకోబోతున్నాడు. 

బర్త్ డే కి ముందు, ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించిన కేసులో హస్బుల్లా, అతని స్నేహితులు కొందరు అరెస్టు అయ్యారు. రోడ్డు మీదున్న ఇతర డ్రైవర్‌లకు ఇబ్బంది కలిగించేలా వాహనాన్ని వేగంగా, ఇష్టం వచ్చినట్లు నడపడంతో ఇన్‌ఫ్లుయెన్సర్‌ను, అతనితో ఉన్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆ తరువాత సంబంధిత అభియోగాలు మోపారని అనేక వార్తా కథనాలు వెలువడ్డాయి. 

"ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించినందుకు హస్బుల్లా, అతని స్నేహితుల్లో కొంతమందిని డాగేస్తాన్‌లోని పోలీసులు అరెస్టు చేశారు. డాగేస్తాన్ అంతర్గత వ్యవహారాల ప్రకారం, అతను, అతని స్నేహితులు వీధిలో హల్ చల్ చేశారు. మిగతా వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. దీంతో పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తాము తమ స్నేహితుని వివాహా వేడుకను సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు వారు తెలిపారని ఓ వార్తా కథనం తెలిపింది. 

ఏదేమైనప్పటికీ సోషల్ మీడియా సంచలనంగా మారిన ఈ ఘటనలో తర్వాత ఏమి జరుగుతుందనేది ఇంకా అస్పష్టంగా ఉంది. ప్రపంచంలోని సుప్రసిద్ధులైన డానా వైట్, ఖబీబ్ నూర్మాగోమెడోవ్, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లాంటి పెద్ద వ్యక్తులతో అతనికి ఉన్న సంబంధాలు కూడా ఈ కేసులో నుంచి బయటపడడానికి సహాయ పడవని తెలుస్తోంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios