Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో : టమాటాలకు కాపలాగా నాగరాజు.. ముట్టుకుంటే.. బుస్సుమంటూ...బాబోయ్...

టమాటాలకు పాము కాపలా కాస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. వేలలైక్స్ తో దూసుకుపోతోంది.

Snake guards tomatoes, video goes viral - bsb
Author
First Published Jul 14, 2023, 2:08 PM IST

టమాటా ధరలు రోజురోజుకీ ఆకాశాన్ని అంటుతున్నాయి.  దీంతో టమాటా దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయి. మార్కెట్లోని టమాటాలను రాత్రికి రాత్రి మాయం చేస్తున్నారు దొంగలు.. ఇక ఇళ్లలో నగదు, నగలతోపాటు ఫ్రిడ్జ్ లోని టమాటాలూ ఎత్తుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లోనైతే టమాటా రైతు హత్యకు గురవడం కూడా షాకింగ్ కలిగించింది. ఇప్పుడు ఆ కోవలోనే టమాటాకు సంబంధించిన మరో వీడియో వైరల్ గా మారింది. 

టమాటాలకు ఏకంగా నాగుపామే కాపలా కాస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ వీడియోలో టమాటాలకు కాపలాగా నాగుపాము ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తులు కూడా టమాటా నిధి లాంటిదని.. అందుకే పాము కాపలాగా ఉందని ఫన్నీగా రాసుకొచ్చారు.  అంతేకాదు ఈ వీడియోలో.. ఓ వ్యక్తి టమాటాలు ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే పాము పడగవిప్పి కాటు వేయడానికి ప్రయత్నించడం కూడా కనిపిస్తుంది..

దీంతో ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లకు హాట్ ఫేవరెట్ గా మారింది. ఇంట్లో దూరిన పాము.. మూలకుపెట్టిన టమాటాల దగ్గరికి చేరినట్టుంది. దాన్ని వీడియో తీసిన ఓ వ్యక్తి ఇలా ఫన్నీగా క్రియేట్ చేసి పెట్టడంతో..  ఇప్పుడు ఇది నెట్టింట్లో వైరల్ గా మారింది.  జంతువులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతుంటాయి.  దీనిమీద నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ కూడా చేస్తుంటారు.

దీంతో ఇప్పుడు ఈ టమాటాలకు కాపలాగా ఉన్న స్నేక్ రాజా వీడియో కూడా  వందల కొద్ది కామెంట్లు.. వేల కొద్ది లైకులతో దూసుకుపోతుంది. టమాటాలకు సంబంధించి వైరల్ అయిన మరో వీడియోలో.. ఒక మొబైల్ కొంటే రెండు కేజీల టమాటాలను ఫ్రీగా ఇచ్చే పథకానికి సంబంధించింది కూడా ఉంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios