Asianet News TeluguAsianet News Telugu

దూద్‌సాగర్ జలపాతం చూడడానికి వచ్చిన ట్రెక్కర్ల తో సిట్-అప్ లు చేయించిన రైల్వే శాఖ.. వీడియో వైరల్..

వర్షాకాలంలో దూద్‌సాగర్‌కు ట్రెక్కింగ్‌ను నిషేధిస్తూ గోవా పోలీసులు, అటవీ శాఖ, రైల్వేలు ఉత్తర్వులు జారీ చేశాయి. భారీ వర్షపాతం కారణంగా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్య తీసుకున్నారు.  

Sit-ups with trekkers who came to see Dudhsagar Fallsvideo went viral - bsb
Author
First Published Jul 17, 2023, 1:28 PM IST

దూద్‌సాగర్‌ : గోవా-కర్ణాటక సరిహద్దులో ఉన్న దూద్‌సాగర్‌కు ట్రెక్కింగ్ వెళ్లినవారు సిట్-అప్‌లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైలు ఆగే స్టేషన్ కంటే ముందే రైలు నుండి దిగడం, జలపాతానికి చేరుకోవడానికి రైలు పట్టాలు దాటడం లాంటి నిబంధనల ఉల్లంఘటనలకు పాల్పడడం.. నిషేధం విధించినా లెక్కచేయకుండా దూద్ సాగర్ కు వెళ్లిన పర్యాటకుల బృందాన్ని రైల్వే పోలీసులు ఈ విధంగా శిక్షించారని ట్వీట్లు వెల్లువెత్తాయి. 

దూద్ సాగర్ జలపాతానికి వర్షాకాలంలో పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటార. పచ్చదనంతో కూడిన జలపాతం సుందరమైన దృశ్యాన్నిచూడడానికి రెండు కళ్లూ చాలవు. వర్షాకాలంలో జలపాతాలు నిండుగా పారుతుంటాయి.. కాబట్టి, బెంగళూరు, మంగళూరు, బెలగావి, ఉత్తర కన్నడ, హుబ్బల్లి-ధార్వాడ్, బాగల్‌కోట్, పూణే, మహారాష్ట్రలోని ఇతర జిల్లాల నుండి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. 

ఈ సందర్శకులు దక్షిణ గోవాలోని కొలెం స్టేషన్‌లో రైలు దిగిన తర్వాత దూద్‌సాగర్ చేరుకోవడానికి సౌత్ వెస్ట్రన్ రైల్వే లైన్ ట్రాక్‌ల వెంట నడుస్తారు. కానీ ఇటీవలి భారీ వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని గోవా పోలీసులు, అటవీ శాఖ, రైల్వేలు వర్షాకాలంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున ట్రెక్కింగ్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.

సంగెం తాలూకాలోని మైనాపి జలపాతంలో ఇద్దరు వ్యక్తులు మునిగిపోవడంతో గోవా ప్రభుత్వం గత వారం రాష్ట్రంలోని జలపాతాలను సందర్శించకుండా నిషేధించింది. నైరుతి రైల్వే విడుదల చేసిన ఒక ట్వీట్‌ను కూడా పోస్ట్ చేసింది, ట్రాక్‌ల వెంట నడవవద్దని ప్రజలను కోరింది.

"మీ కోచ్ లోపల నుండే దూద్‌సాగర్ జలపాతం అందాలను ఆస్వాదించమని మిమ్మల్ని కోరుతున్నాం. ట్రాక్‌లపై/ ట్రాక్ లవెంట నడవడం మీ స్వీయ భద్రతకు హాని కలిగించడమే కాకుండా, రైల్వే చట్టంలోని 147, 159 సెక్షన్‌ల ప్రకారం నేరం. ఇది రైళ్ల భద్రతకు కూడా ప్రమాదం కలిగిస్తుంది"అని ట్వీట్ చేసింది.

సౌత్ వెస్ట్రన్ రైల్వే ప్రయాణికులు సహకరించాలని మరియు వారి భద్రత కోసం నిర్దేశించిన నిబంధనలను అనుసరించాలని అభ్యర్థించింది. దూద్‌సాగర్ పశ్చిమ కనుమల మీదుగా మండోవి నదిలో, 1,017 అడుగుల ఎత్తులో ప్రవహిస్తుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios