పోయిందనుకున్న ఐఫోన్... పదేళ్ల తర్వాత టాయ్ లెట్ లో...!

ఇక చేసేది లేక.. మరో ఫోన్ కొనుక్కుంది.  ఆ ఫోన్  గురించి కూడా మర్చిపోయింది. ఆ ఫోన్ పోయిన తర్వాత దాదాపు పదేళ్ల తర్వాత ఆమెకు ఆ పోన్ దొరకడం గమనార్హం.

She Lost Her iPhone A Decade Ago. It Was Found Inside A

ఆమె ఎంతో ఇష్టంగా ఐఫోన్ కొనుక్కుంది. కానీ.. అనుకోకుండా ఒక రోజు ఆ ఫోన్ కనిపించకుండా పోయింది. ఇళ్లంతా వెతికింది.. కానీ దొరకలేదు. కనీసం ఆమె ఆ రోజు బయటకు కూడా పోలేదు. బయట ఫోన్ పోయే ఛాన్సే లేదు.  కానీ ఇంట్లో మొత్తం వెతికినా కూడా ఆమెకు ఫోన్  దొరకలేదు. ఇక చేసేది లేక.. మరో ఫోన్ కొనుక్కుంది.  ఆ ఫోన్  గురించి కూడా మర్చిపోయింది. ఆ ఫోన్ పోయిన తర్వాత దాదాపు పదేళ్ల తర్వాత ఆమెకు ఆ పోన్ దొరకడం గమనార్హం. ఈ సంఘటన మేరీల్యాండ్ లో చోటుచేసుకోగా  ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మేరీల్యాండ్‌కి చెందిన బెక్కీ బెక్‌మాన్ అనే ఆ మహిళ 2012లో తన ఐఫోన్‌ని పోగొట్టుకుంది. ఆమె ఇంటి నుంచి బయటకు ఎక్కడికి వెళ్లలేదు. తాగి పడేసుకుందా అంటే అదీ లేదు. దీంతో తన ఐఫోన్ ఎక్కడ పోయిందనే విషయంలో ఆమెకు బిగ్ కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఆ మిస్టరీని చేధించలేక.. కొన్నాళ్లకు దాన్ని పూర్తిగా మరిచిపోయింది. కొత్త ఫోన్ కొనుక్కుని దాన్ని వాడటం మొదలుపెట్టింది.

ఈ క్రమంలో ఇటీవల బెక్కీ బెక్‌మాన్ ఉంటున్న ఇంట్లోని టాయిలెట్‌లో కొన్ని శబ్దాలు వినిపించడం మొదలైంది. ముఖ్యంగా టాయిలెట్ ఫ్లష్ నొక్కినప్పుడు ఆ శబ్దాలు ఎక్కువగా వినిపించేవి. బహుశా టాయిలెట్ పాతదైపోవడం.. లేదా పైపుల్లో ఏదైనా సమస్య కారణంగా ఆ శబ్దాలు వస్తున్నాయేమోనని భావించారు. ఒకానొక రోజు బెక్కీ భర్త.. టాయిలెట్ ప్లంజర్‌తో టాయిలెట్‌ లోపల అటు, ఇటు కదిపాడు. అంతే.. పదేళ్ల క్రితం అతని భార్య పోగొట్టుకున్న ఐఫోన్ బయటపడింది. వెంటనే దాన్ని తీసుకుని భార్య వద్దకు పరిగెత్తుకొచ్చాడు. 

అప్పుడెప్పుడో పోగొట్టుకున్న ఫోన్ అనూహ్యంగా ఇంట్లోనే దొరికేసరికి ఆమె ఆశ్చర్యపోయింది. అయితే అది వాటర్ ప్రూఫ్ కాకపోవడంతో దాని బేసిక్ స్ట్రక్చర్ మినహా అంతా డ్యామేజ్ అయింది. యూఎస్ మీడియా ద్వారా ఈ కథనం వెలుగులోకి వచ్చింది. అయితే పలువురు నెటిజన్లు దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల పాటు ఫోన్ టాయ్ లెట్ లో  ఎలా ఉందంటూ కొందరు  ప్రశ్నిస్తుండటం గమనార్హం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios