పూల వ్యాపారి జీవితంలో అద్భుతం ... భార్య ఖాతాలో రూ.30కోట్లు
అతని భార్య రిహానా బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా రూ.30కోట్లు వచ్చి పడ్డాయి. దీంతో.. ఆ డబ్బులు మీకు ఎవరు పంపారంటూ బ్యాంకు అధికారులు ఆ పూల వ్యాపారిని ప్రశ్నించడం గమనార్హం. అయితే... ఆ డబ్బులు తమ ఖాతాలోకి ఎలా వచ్చాయో తమకు అసలు తెలీదని వారు చెప్పారు.
అతను ఓ పూల వ్యాపారి. రోజంతా ఎండనకా, వాననకా పూలు అమ్మితే తప్ప.. వాళ్లకు ఐదు వేళ్లు నోట్లుకి వెళ్లవు. అలాంటిది వారి జీవితంలో ఓ అద్భుతం జరిగింది. ఆ పూలవ్యాపారి భార్య బ్యాంక్ ఖాతాలో ఒక్కసారిగా రూ.30కోట్లు వచ్చిపడ్డాయి. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటకలోని రామనగర జిల్లా చెన్నపట్టణలో నివసించే సయ్యద్ మాలిక్ బుర్హాన్ స్థానికంగా పూలు అమ్ముకొని జీవిస్తుంటారు. అతని భార్య రిహానాకు ఎస్‌బీఐలో జన్‌ధన్ ఖాతా ఉంది. గతేడాది డిసెంబరు 2న బ్యాంకు అధికారులు అతని ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు.
అతని భార్య రిహానా బ్యాంకు ఖాతాలో అకస్మాత్తుగా రూ.30కోట్లు వచ్చి పడ్డాయి. దీంతో.. ఆ డబ్బులు మీకు ఎవరు పంపారంటూ బ్యాంకు అధికారులు ఆ పూల వ్యాపారిని ప్రశ్నించడం గమనార్హం. అయితే... ఆ డబ్బులు తమ ఖాతాలోకి ఎలా వచ్చాయో తమకు అసలు తెలీదని వారు చెప్పారు.
Also Read పెళ్లిలో వధువు అదిరిపోయే స్టెప్పులు.. వరుడి సంగతేమోకానీ, నెటిజన్లు ఫిదా...
దీంతో.. వాళ్లని అధికారులు బ్యాంకు వద్దకు తీసుకువెళ్లారు. తీరా బ్యాంకుకు వెళ్లాక, డాక్యుమెంట్లపై సంతకం పెట్టమని అధికారులు ఒత్తిడి తెచ్చారని, అయితే తాము నిరాకరించామని బుర్హాన్ తెలిపారు. ఆన్‌లైన్‌లో చీర కొన్నామని, ఆ తర్వాత కారు గెలుచుకున్నారంటూ ఫోన్‌కాల్ వచ్చిందని, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని చెప్పారు.
‘అంతకుముందు ఆ ఖాతాలో రూ.60 మాత్రమే ఉంది. ఆ తర్వాత అంత డబ్బు ఎలా జమైందో అర్థం కావడం లేదు. అప్పటి నుంచి ఆ విషయం తెలుసుకునేందుకుమేం తిరగని చోటంటూ లేదు’ అని బుర్హాన్ అన్నారు. ఆదాయపన్నుశాఖ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశానని, అయితే దర్యాప్తు చేసేందుకు అధికారులు తొలుత ఆసక్తి చూపలేదని చెప్పారు.
ఆయన ఫిర్యాదు ఆధారంగా స్థానిక పోలీసులు జనవరి 9న కేసు నమోదు చేశారు. ఆ ఖాతాలో అనేక ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, ఆ వివరాలేవీ బుర్హాన్‌కు తెలియవన్నారు.