భయంకరం.. రోలర్ కోస్టర్ లో తలకిందులుగా మూడు గంటలు..వీడియో వైరల్..

సరదాగా రోలర్ కోస్టర్‌ ఎక్కిన ప్రయాణికులకు భయంకర అనుభవం ఎదురయ్యింది. కోస్టర్ లోతలక్రిందులుగా మూడు గంటలపాటు రైడర్లు ఇరుక్కున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియోవైరల్ అయ్యింది. 

Riders stuck three hours upside down in roller coaster in usa, video goes viral - bsb

అమెరికా : రోలర్ కోస్టర్ ఎక్కాలంటే కొంతమందికి విపరీతమైన భయం.. మరికొంతమందికి ఎంతో సరదా. తలకిందులుగా తిరిగేప్పుడు ఒళ్లు గాల్లో తేలిపోవడం.. దూదిపింజంలా మారిపోతుంది. అదొక అద్భుతమైన అనుభవంగా అనిపిస్తుంది. అయితే, ఈ సరదా కొంతమందికి భయంకరమైన అనుభవంగా మారింది. రోలర్ కోస్టర్ ఎక్కిన వారు తలకిందులుగా 3 గంటలపాటు ఉండిపోయారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని క్రాండన్‌ పార్క్‌లో జరుగుతున్న ఫారెస్ట్‌ కౌంటీ ఫెస్టివల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

అమెరికాలోని క్రాండన్ పార్క్‌లోని ఫారెస్ట్ కౌంటీ ఫెస్టివల్‌లో కొంత మందిరోలర్ కోస్టర్ రైడ్ చేశారు. అయితే, వారు రోలర్ కోస్టర్ స్టార్ అయిన కాసేపటికి దాంట్లో సాంకేతిక లోపం తలెత్తింది. ఇంకేముంది.. తలకిందులుగా వేలాడుతూ అలాగే ఉండిపోయారు. అలా దాదాపు 3 గంటలపాటు ఉన్నారు. 

భార్యకు ప్రేమ పరీక్ష.. విషం తాగిన భర్త.. చివరికి ఏం జరిగిందంటే...

ఎన్ బీసీ న్యూస్ ప్రకారం, ఆదివారం రైడ్ మధ్యలో రోలర్ కోస్టర్ పాడయ్యింది. దీంతో మూడు గంటల పాటు తలక్రిందులుగా వేలాడుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక వీడియో రోలర్ కోస్టర్‌లో ప్రయాణికులు వేలాడుతున్నట్లు చూపిస్తుంది. వారిని రక్షించడానికి ఒక రెస్క్యూ సిబ్బంది రైడ్‌ ఎక్కుతున్నట్లు చూడవచ్చు.

ఈ వీడియోను సాషా వైట్ అనే అకౌంట్ హోల్డర్ షేర్ చేశారు. “రోలర్ కోస్టర్ లాంటి ఆకర్షణలో చిక్కుకున్న ఎనిమిది మంది సుమారు మూడు గంటల పాటు తలక్రిందులుగా వేలాడారు. అమెరికన్ విస్కాన్సిన్‌లో జరిగిన ఒక ఉత్సవంలో ఈ ప్రమాదం జరిగింది. చిక్కుకుపోయిన ఎనిమిది మందిలో ఏడుగురు చిన్నారులేనని స్థానిక మీడియా కథనం.. ప్రాథమిక సమాచారం ప్రకారం, అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వీరిని సురక్షితంగా రక్షించారు. 

క్రాండన్ ఫైర్ డిపార్ట్‌మెంట్ కెప్టెన్ మాట్లాడుతూ, “రైడ్‌లో మెకానికల్ వైఫల్యం ఉందని, కోచ్ లు పైకి వెళ్లిన తరువాత ఆగిపోయిందని తెలిసింది. ఇటీవల విస్కాన్సిన్ రాష్ట్రంలో దీన్ని తనిఖీ చేశారు. ఇంతకు మించి మా దగ్గర ప్రస్తుతం ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఎవరికీ గాయాలు కాలేదని, వారు సురక్షితంగా రైడ్‌లో దిగిన వెంటనే పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారని’ తెలిపారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios