అప్పుడు ఎల్లో, ఇప్పుడు పింక్ చీరలో... మరోసారి సెన్సేషన్ గా ఎన్నికల అధికారి

ఈ ఏడాది మేలో లోక్ సభ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్నికల కన్నా కూడా రీనా ద్వివేది ఎక్కువ పాపులర్ అయ్యారు. పసుపు రంగు చీర కట్టుకొని.. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని... కల్లకి నల్లకళ్లద్దాలు పెట్టుకొని చేతిలో ఈవీఎంతో ఆమె నడుచుకుంటూ వస్తుంటే.. కెమేరామెన్ లు తమ చేతికి పని చెప్పారు. ఇంకేముంది ఆ ఫోటోలు నెట్టింట వైలర్ గా మారాయి.
 
Reena Dwivedi Officer in yellow sari returns, this time in pink for byelection

లోక్ సభ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఎన్నికల అధికారి రీనా ద్వివేది మరోసారి నెట్టింట హల్ చల్ చేసింది. అప్పుడు పసుపు రంగ చీరలో పోలింగ్ కేంద్రంకి వస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తాజాగా జరిగిన ఎన్నికల సమయంలో ఆమె మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

ఉత్తరప్రదేశ్ లో నిన్న జరిగిన ఉపఎన్నికల సందర్భంగా విధులకు హాజరైన ఆమెను కెమేరాలు మరోసారి బందించేశాయి. లక్నో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో భాగంగా కృష్ణానగర్ లోని మహానగర్ పబ్లిక్ ఇంటర్ కాలేజీలో ఆమె పోలింగ్ నిర్వహించారు. గతంలో పసుపు రంగు చీరలో వచ్చిన ఆమె ఈసారి పింక్ కలర్ చీరలో దర్శనమిచ్చారు. ఈసారి కూడా ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఈ ఏడాది మేలో లోక్ సభ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎన్నికల కన్నా కూడా రీనా ద్వివేది ఎక్కువ పాపులర్ అయ్యారు. పసుపు రంగు చీర కట్టుకొని.. స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకొని... కల్లకి నల్లకళ్లద్దాలు పెట్టుకొని చేతిలో ఈవీఎంతో ఆమె నడుచుకుంటూ వస్తుంటే.. కెమేరామెన్ లు తమ చేతికి పని చెప్పారు. ఇంకేముంది ఆ ఫోటోలు నెట్టింట వైలర్ గా మారాయి.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రీనా ప్రభుత్వ ఉద్యోగి. లఖ్‌నవూలోని పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఐదో దశ ఎన్నికల్లో భాగంగా మే 6న లఖ్‌నవూలోని నగ్రామ్‌లో గల ఓ పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహించారు. ఇందుకోసం మే 5న ఈవీఎంలు తీసుకుని పోలింగ్‌ కేంద్రానికి వెళ్తూ కెమెరాకు చిక్కారు. ఓ మీడియా జర్నలిస్టు ఆమె ఫొటో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఒక్కసారిగా ఆమె ఫొటో వైరల్‌ అయ్యింది.

Reena Dwivedi Officer in yellow sari returns, this time in pink for byelection

ఆమె అందంగా ఉండటంతో.. ఆమె విరవాల కోసం నెటిజన్లు గూగుల్ లో తెగ వెతికేశారు. చివరకు ఆమె వివరాలు తెలుసుకోగలిగారు. అయితే.. ఆమె పేరిట మీమ్స్ కూడా క్రియేట్ చేశారు. ఆమెను చూడటానికైనా ఓటర్లు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఉంటారని.. అక్కడ 100శాతం పోలింగ్ జరిగి ఉంటుందని నెటిజన్లు జోకులు వేశారు.

Reena Dwivedi Officer in yellow sari returns, this time in pink for byelection

ఆ జోకులపై కూడా ఆమె స్పందించడం విశేషం. తాను విధులు నిర్వహించిన దగ్గర 100శాతం పోలింగ్ జరగలేదని..కేవలం 70శాతమే జరిగిందని ఆమె చెప్పారు. రీనా ద్వివేదితోపాటు.. మరో అధికారిణి కూడా పాపులర్ అయ్యింది. ఆమె నీలం రంగు గౌను వేసుకొని అందంగా ఉంది. ఆమె కూడా మోడల్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది. అయితే... ఆమె వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఈ ఎన్నికల ఎఫెక్ట్ తో ఆమెకు సోషల్ మీడియాలో కూడా పాపులారిటీ బాగా పెరిగిపోయింది. వేల మంది ఆమె సోషల్ మీడియా ఖాతాలను అనుసరిస్తుండటం విశేషం. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios