Asianet News TeluguAsianet News Telugu

కేరళలో టీ అమ్ముతున్న రజనీకాంత్ ! .. వీడియో వైరల్‌...

సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోర్ట్ కొచ్చిలో టీ దుకాణం నడుపుతున్నారు. ఆశ్చర్యపోయారా? ఇది చదివితే మీరూ ఒప్పేసుకుంటారు. చూడండి...  

Rajinikanth is selling tea in Kerala, video viral - bsb
Author
First Published Oct 25, 2023, 8:32 AM IST

ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు. వీరినే ఇటీవలి కాలంలో డోపెల్‌గాంగర్‌లు అంటున్నారు. వీరిని కనుక్కోవడానికి కొన్ని ప్రత్యేకమైన యాప్ లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. మామూలు వ్యక్తులను పోలిన వారు కనిపించడం పెద్దగా పట్టించుకోరు కానీ.. అదే సెలబ్రిటీల పోలికలతో ఉంటే వెంటనే వారు ఫేమస్ అయిపోతారు. అలాంటి ఓ డోపెల్‌గాంగర్‌ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ డోపెల్‌గ్యాంగర్ వీడియో ఇంటర్నెట్‌లో సునామిగా మారింది. 

ఫోర్ట్ కొచ్చిలోని పట్టాలం రోడ్‌లో టీ దుకాణం నడుపుతున్న సుధాకర్ ప్రభు, లెజెండరీ నటుడు రజనీకాంత్ ను అచ్చుగుద్దినట్టుగా ఉంటాడు. దీంతో ఇప్పుడు ఈయన వీడియో ఇంటర్నెట్‌లో ట్రెండింగ్‌లో ఉంది. వైరల్ అయిన ఈ వీడియోలో ప్రభు.. రజనీకాంత్ వ్యవహారశైలిని అనుకరిస్తూ కొంతమంది వ్యక్తులతో మాట్లాడటం కనిపించింది.

మూఢత్వానికి మహిళ బలి.. దెయ్యం విడిపిస్తానని తాంత్రికుడి చిత్రహింసలు.. వివాహిత మృతి

@despoters_12345 అనే అకౌంట్ యూజర్ ఈ వీడియో Xలో షేర్ చేశాడు. తలైవాతో ప్రభుకు చాలాదగ్గరి పోలికలు ఉండడాన్ని మొదటగా మలయాళ నటుడు-దర్శకుడు నాదిర్షా గమనించారు. ఆయన  చిత్ర షూటింగ్ కోసం ఫోర్ట్ కొచ్చిలో ఉన్నప్పుడు ఇది జరిగింది. దీని గురించి ఆయన మాట్లాడుతూ.. ''ఆశ్చర్యం! అతనికి రజనీకాంత్ గారికి ఎంతో దగ్గరి పోలికలున్నాయి. ఫోర్ట్ కొచ్చికి చెందిన సుధాకర ప్రభు పేరుకు దొర అయినా.. టీ దుకాణంలో పని చేస్తున్నాడు’’ అంటూ అతని కొన్ని ఫొటోలను ఫేస్ బుక్ లో షేర్ చేశాడు దర్శకుడు.

ఈ పోస్ట్ వైరల్ అవ్వడంతో ప్రభుకు కేరళలోని అనేక ప్రాంతాలనుంచి వివిధ ఈవెంట్‌లు, ఫంక్షన్‌లకు ఆహ్వానాలు అందాయి.  గత సంవత్సరం, తలైవర్‌ను పోలి ఉండే పాకిస్థాన్‌కు చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రెహ్మత్ గష్కోరీ ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యాయి. అతను రజనీకాంత్‌లా కనిపిస్తున్నాడని అతని సహోద్యోగులు చెప్పడంతో గష్కోరి తనకు రజనీకాంత్ పోలికలున్నాయని గ్రహించారు. అతని బాడీ లాంగ్వేజ్, హెయిర్‌డో,స్ట్రైడ్ తలైవర్‌ని పోలి ఉన్నాయని చాలా మంది వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే, రజనీకాంత్ ప్రస్తుతం తన 170వ సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఇది సోషల్ మెసేజ్‌తో కూడిన ఎంటర్‌టైనర్‌. చివరిగా రజనీకాంత్ నెల్సన్ దర్శకత్వం వహించిన జైలర్‌లో నటించారు. ఆగస్ట్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ చిత్రం "అంచనాలకు మించిన విజయం" అని ప్రముఖ నటుడు అన్నారు. రజనీకాంత్ రాబోయే చిత్రాలలో లోకేష్ కనగరాజ్, కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ లాల్ సలామ్‌తో ఇంకా పేరు పెట్టని ప్రాజెక్ట్ కూడా ఉంది.

 

Follow Us:
Download App:
  • android
  • ios