Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో.. టేకాఫ్‌కు ముందు తండ్రి పాదాలను తాకిన పైలట్ కూతురు...

ఓ తండ్రీ కూతుర్ల భావోద్వేగ క్షణాలు నెటిజన్ల హృదయాల్ని దోచుకుంటున్నాయి. దీనికి సంబంధించి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది. 

pilot daughter touching her fathers feet before take-off video goes Viral - bsb
Author
First Published Jan 18, 2023, 12:47 PM IST

న్యూఢిల్లీ : తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితంలో విజయం సాధించాలని, వారి లక్ష్యాలు చేరుకోవాలని కోరుకుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను మెరుగుపరచడానికి, వారు తమ లక్ష్యాలను సాధించడంలో సహాయం చేయడానికి ఎలాంటి త్యాగాలు చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ప్రతిగా, పిల్లలు తమ తల్లిదండ్రులను గర్వించేలా చేయాలని కోరుకుంటారు. అది జరిగిన క్షణాలు భావోద్వేగపూరితగా మారిపోతాయి. అలాంటి ఓ ఘటనే ఇది. తండ్రికూతుళ్ల భావోద్వేగ క్షణాలను బంధించిన ఓ వీడియో నెటిజన్ల హృదయాలను తాకింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో, పైలట్ అయిన కుమార్తె తన తండ్రి నుండి ఆశీర్వాదం తీసుకుని.. అతన్ని కౌగిలించుకోవడం కనిపిస్తుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో కెప్టెన్ క్రుతద్న్యా హేల్ అనే అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియో, పైలట్ కెమెరాకు చేయి ఊపుతుండడంతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత ఆమె విమానం విండో సీటులో కూర్చున్న తన తండ్రి వద్దకు వెళుతుంది. ఆమె అతని పాదాలకు నమస్కరించింది. తండ్రి ఆమెను ఆశీర్వదించాడు. ఆ తరువాత తండ్రి..కూతురిని ప్రేమతో కౌగిలించుకుంటాడు. కూతురిని గర్వంగా చూసుకుంటాడు.

“పైలట్ కూతురు నడుపుతున్న విమానంలో తండ్రి ప్రయాణిస్తున్నాడు. అదే అతని సంతోషబాష్పాలకు కారణం. నా తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా నేనేప్పుడు ఇళ్లు వదిలి వెళ్లలేదు. కొన్నిసార్లు నేను తెల్లవారుజామునే వెళ్లాల్సి వస్తుంది. నా తల్లిదండ్రులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు తెల్లవారుజామున 3-4 గంటలకు ఇంటి నుండి బయలుదేరుతాను, అయినప్పటికీ వారి పాదాలను తాకకుండా ఇంటి నుండి బయలుదేరడం నాకు అలవాటు లేదు. అలా చేస్తే అసంపూర్ణంగా ఉంటుంది” అని ఈ వీడియో షేర్ చేస్తూ రాసుకొచ్చిందామె. 

జనవరి 7న షేర్ చేయబడిన ఈ వీడియోకు ఇప్పటివరకు 9.1 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. నెటిజన్లు ఈ వీడియోను ఇష్టపడ్డారు. కామెంట్లలో తమ ఇష్టాన్ని చూపించారు. “హాయ్ క్రుతద్న్యా మీరు మీ తల్లిదండ్రులకు బాధ్యతగల కుమార్తె మాత్రమే కాదు. విమానయాన సంస్థకు, ప్రయాణీకురాలిగా బాధ్యతాయుతమైన పైలట్‌గా ఇప్పుడు మీరు దేశానికి బాధ్యతగల కుమార్తె. ఇది మీ గుర్తింపు.  మీరు ఎల్లప్పుడూ కీర్తితో ఆకాశాన్ని తాకబోతున్నారు. ఇది మీ గుర్తింపు. ఒక రోజు మిమ్మల్ని,  మీ కుటుంబాన్ని కలవాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ”అని ఒక వ్యక్తి హార్ట్ సింబల్ తో వ్యాఖ్యానించాడు. 

"ఈ వీడియో చూసిన తర్వాత నా కన్నీళ్లు ఆపుకోలేకపోతున్నాను" అని మరొకరు అన్నారు. "ఆమె తన తండ్రికి ఎలా గౌరవం ఇస్తుందో ప్రేమించండి, మన పిల్లలు మన త్యాగాలను, వారి పట్ల మన ప్రేమను మరచిపోనప్పుడు అందంగా ఉంటుంది. తల్లిదండ్రులుగా కూడా గర్వించదగిన క్షణం, అందమైన క్షణం. దేవుడు ఆమెను ఆశీర్వదిస్తాడు, ”అని మూడో వ్యక్తి వ్యాఖ్యానించాడు.

 

Follow Us:
Download App:
  • android
  • ios