పుట్టగానే ఏ బిడ్డ అయినా ఏడుస్తుంది.. ఒకవేళ ఏడవకపోతే.. కొట్టో... తల కిందకు తిప్పో..డాక్టర్లు ఏడ్పించడానికి ప్రయత్నిస్తారు. అయినా ఏడవకపోతే.. వేడి నీళ్లు కూడా మీద పోస్తారు. అయితే... ఇలానే పుట్టగానే ఏడవట్లేదని.. ఓ బిడ్డను డాక్టర్లు ఏడిపించడానికి ప్రయత్నిస్తే.. గుడ్లు ఉరిమి మరీ చూశాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది.

ఈ ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకోగా... పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  ఈ ఫొటో బ్రెజిల్‌లోని రియో డీ జెనెరియోకు సంబంధించినది. అక్కడ ఇటీవల ఒక మహిళ పండంటి శిశువుకు జన్మనిచ్చింది. వైద్యులు బొడ్డు తాడు కట్ చేసేముందు ఆ శిశువును ఏడిపించేందుకు ప్రయత్నిస్తుండగా, ఆ శిశువు ఇచ్చిన రియాక్షన్‌కు వైద్యులు కంగుతిన్నారు. దీనికి సంబంధించిన ఫొటో కెమెరాలో బందీ అవడంతో పాటు బయటకు రాగానే వైరల్‌గా మారింది.

 ఈ ఫొటోను చూసిన వారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఆ శిశువు పుట్టిన వెంటనే ఏడవలేదు. దీంతో వైద్యులు బొడ్డుతాడు కట్ చేసేముందు ఆ శిశువును ఏడిపించే ప్రయత్నం చేశారు. 

దీంతో ఆ శిశువు వైద్యులవైపు ఉరుముతున్నట్టు చూసింది. మొదట ఆ శిశువు చూపును గమనించిన వైద్యులు కంగుతిన్నప్పటికీ తరువాత తేరుకున్నారు. ఆ శిశువు పూర్తి ఆరోగ్యంతో ఉండటంతో సంతోషం వ్యక్తం చేశారు.  కాగా... ఇప్పుడు ఆ శిశువు ఫోటోకి నెటిజన్లు చేస్తున్న కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఈ ఫోటోకి క్యాప్షన్  ఇవ్వండి అంటూ కొందరు ఆ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయగా... వింత  కామెంట్స్ పెడుతున్నారు. ‘‘ మళ్లీ వెజిటేరియన్ ఫ్యామిలీలోనే పుట్టానా అంటూ ఆ బేబీ అలా చూస్తోందని ఒకరు కామెంట్ చేయగా...  సమ్మర్ తర్వాత బయటకు తీయెచ్చుగా బయట ఎండలు మండిపోతున్నాయన్నట్లుగా చూస్తున్నాడని కొందరు మెసేజ్ చేయడం విశేషం.