మనుషులకేనా ప్రేమలు... మాకూ ఉన్నాయని నిరూపించిన నెమలి (వీడియో)

అనుకోకుండా వాటిలో ఒకటి ప్రాణాలు విడిచింది. ఇక రెండో దాని బాధ వర్ణణాతీతం. తన మిత్రుడు.. చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ నెమలిని పూడ్చడానికి తీసుకువెళ్తుంటే.. ఇది కూడా వారి వెంట వెళ్లడం గమనార్హం

Peacock Refuses To Leave "Long Time Partner" After Its Death

బంధాలు, అనుబంధాలు, ప్రేమ, ఆప్యాయతలు.. కేవలం మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా ఉంటాయి. అవి కూడా తమ తోటి జంతువులపై ప్రేమ పెంచుకుంటాయి. ఒక దానికి మరొకటి తోడుగా నిలుస్తాయి. రెండు నెమళ్లు కూడా.. అంతే కలిసి ఉన్నాయి. దాదాపు నాలుగేళ్లపాటు.. అవి సహజీవనం చేశాయి. అయితే.. అనుకోకుండా వాటిలో ఒకటి ప్రాణాలు విడిచింది. ఇక రెండో దాని బాధ వర్ణణాతీతం. తన మిత్రుడు.. చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. ఆ నెమలిని పూడ్చడానికి తీసుకువెళ్తుంటే.. ఇది కూడా వారి వెంట వెళ్లడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. చ‌నిపోయిన ఒక నెమ‌లిని ఇద్దరు వ్య‌క్తులు తీసుకొని పోతుంటే.. దాని వెన‌క మ‌రో నెమ‌లి న‌డుచుకుంటూ పోతుంది. ఆ వీడియోను చూసిన ఎవ‌రైనా ఇత‌ర జీవుల్లో కూడా బాధ‌, ప్రేమలు ఉంటాయని ఒప్పుకుంటారు. రాజ‌స్థాన్ కు చెందిన ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ఈ వీడియోను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. 

 

చ‌నిపోయిన ఓ నెమ‌లి మృత‌దేహాన్ని ఇద్దరు వ్య‌క్తులు తీసుకొని వెళ్తుంటే.. వారి వెన‌క దీనంగా న‌డుచుకుంటూ వెళ్తున్న మ‌రో నెమ‌లిని మ‌నం ఆ వీడియోలో గ‌మ‌నించవ‌చ్చు. రాజస్థాన్‌లోని కుచేరాలో శ్రీ రామస్వరూప్ బిష్ణోయ్ ఇంటికి స‌మీపంలో ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుందని పర్వీన్ అన్నారు. గ‌త నాలుగేళ్లుగా ఈ రెండు నెమ‌ళ్లు స‌హ‌జీవనం చేసుకుంటున్నాయని తెలిపారు. చివ‌రికి చ‌నిపోయిన నెమ‌లి అంత్య‌క్రియ‌ల్లో కూడా రెండో నెమ‌లి పాల్గొంద‌ని ట్విట్ట‌ర్ ద్వారా ప‌ర్వీక్ చెప్పారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios