Asianet News TeluguAsianet News Telugu

నాటు నాటు పాటకు పాకిస్తాన్ నటి స్టెప్పులు... నెటిజన్లు ఫిదా..!

కేవలం మన దేశీలయులే కాదు... విదేశీయులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా... ఓ పాకిస్తాన్ నటి కూడా.. నాటు నాటు పాటకు స్టెప్పులు వేయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
 

Pakistani Actress hania Aamir Dancing Naatu Nattu . superb, says Internet
Author
First Published Mar 20, 2023, 12:53 PM IST

తెలుగు సినిమాకు అరుదైన ఘనత దక్కింది. అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తా చాటింది. రాజమౌళి దర్శకత్వంలో తెరక్కెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్ దక్కింది. బెస్ట్ ఓరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తానికి ఆస్కార్ సాధించింది నాటు నాటు సాంగ్. ప్రపంచ వేదికపై కీరవాణి, చంద్రబోస్ ఈ అవార్డ్ ను అందుకున్నారు. కాగా.... ఆస్కార్ లభించినందుకు ఈ సినిమా టీమ్ పై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి.

కేవలం మన దేశీలయులే కాదు... విదేశీయులు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. తాజాగా... ఓ పాకిస్తాన్ నటి కూడా.. నాటు నాటు పాటకు స్టెప్పులు వేయడం విశేషం. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 

పాకిస్థానీ నటి హనియా అమీర్ నాటు నాటు పాటకు స్టెప్పులు ఇరగదీసింది. ఈ వీడియో ప్రస్తుతం  ఇంటర్నెట్‌లో హల్ చల్ చేస్తోంది. కాగా... దీనిని హర్ష్ గోయెంకా కూడా షేర్ చేయడం విశేషం.

ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను RPG ఛైర్మన్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. 35 సెకన్ల క్లిప్‌లో, హనియా ఓ వివాహ వేడుకలో పాటకు ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. వీడియోలో  ఆమె గోల్డెన్ షరారా సెట్‌లో అందంగా కనిపించింది. ఆమె షరారా ధరించి స్నీకర్స్ వేసుకున్నారు.. హనియాతో పాటు సబూర్ అలీ అనే మరో నటుడు ఉన్నాడు. వారి స్టెప్పులకు అక్కడ ఉన్న ప్రేక్షకులు కూడా ఆనందించడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios