Viral: బ్యాటింగ్ చేయబోయి బొక్కబోర్లా పడిన ఎమ్మెల్యే.. వీడియో వైరల్
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్నది. ఒడిశాకు చెందిన ఎమ్మెల్యే భుపేంద్ర సింగ్ ఓ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించడానికి వెళ్లి బ్యాట్ చేతపట్టాడు. బాల్ వేయగానే.. దాన్ని కొట్టబోయి అదుపుతప్పి బొక్కబోర్లా పడ్డాడు.
ఆ ఎమ్మెల్యే ఓ క్రికెట్ మ్యాచ్ ప్రారంభించడానికి వెళ్లాడు. సాధారణంగా నేతలు బ్యాట్ చేతిలో పట్టి హుషారుతో మ్యాచ్ ప్రారంభిస్తారు. అలాగే.. ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే క్రికెట్ మ్యాచ్ ప్రారంభించడానికి వెళ్లి బ్యాట్ చేత పట్టాడు. ఓ యువకుడు బౌల్ చేయగా.. దాన్ని ఏకంగా బౌండరీకే తరలించాలని షాట్ కొట్టబోయాడు. కానీ, బొక్కబోర్లా పడ్డాడు. ఏకంగా పిచ్ దాటిపోయి పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
యువతను ఎంగేజ్ చేసుకోవడానికి రాజకీయ నేతలు టోర్నీలు పెడుతుంటారు. మ్యాచ్‌లకు స్పాన్సర్ చేస్తుంటారు. క్రికెట్ కిట్లు అందిస్తుంటారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు ఈ వ్యవహారం ఎక్కువగా కనిపిస్తుంది. త్వరలో ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజకీయ నేతలు యువతను ఆకట్టుకునే పనుల్లో మునిగిపోయారు. ఇందులో భాగంగానే ఒడిశాలోని నార్ల ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ కలహండికి వెళ్లాడు. కలహండిలో ఓ క్రికెట్ మ్యాచ్ ఓపెనింగ్ కోసం పోయాడు. అక్కడే ఓ యువకుడు బాల్ వేయగా.. దాన్ని బ్యాట్‌తో కొట్టబోయి అదుపుతప్పి పడిపోయాడు.
Also Read: Lok Sabha Elections: టీబీజేపీలో టికెట్ వార్? ఈటల వర్సెస్ రఘునందన్..!
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోపై కామెంట్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. కొందరు రాజకీయ నాయకులు రాజకీయాలకే పరిమితం కావడం బెటర్ అని చెబుతుండగా.. క్రీడల్లో కూడా రాజకీయం చేస్తే ఇదే గతి అవుతుందని ఇంకొందరు కామెంట్లు చేశారు.