కరోనా వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు సమాజానికి మేలు చేసేందుకు గాను ఉన్న ఏకైక మార్గం మాస్క్‌లు ధరించడం. నిత్యావసర వస్తువుల లాగానే ఇది కూడా సామాన్యుల జీవితాల్లో భాగమైపోయింది.

ఇప్పుడిప్పుడే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే దాఖలాలు లేకపోవడంతో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ముందుకు సాగుతోంది ప్రభుత్వం. కాగా.. యూఏఈలోని ఆ ఆపరేషణ్ థియేటర్‌లో తీసిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

అప్పుడే పుట్టిన బిడ్డ డాక్టర్ మాస్క్‌ను లాగిపడేశాడు. ఈ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఆయన ‘‘త్వరలోనే మాస్కును తొలగించే సమయం ఆసన్నం కావాలంటూ మనమందరం కోరుకుంటున్నాం కదా’’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు.

దీనికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన. పుట్టగానే మాస్కు తీసి పడేసింది. 2020లో నేను చూసిన అద్భుతమైన ఫొటో ఇదే. అన్నీ సజావుగా సాగి మనమంతా మాస్కు లేకుండా బయటకు వెళ్లగలిగే రోజులు త్వరలోనే రావాలి. మెరుగైన మన భవిష్యత్తుకు ఈ చిన్నారి ఫొటో ఓ సంకేతంలా కనిపిస్తోంది’’అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు