Asianet News TeluguAsianet News Telugu

అదృష్టవంతుడు.. వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు..!

ఈ వీడియో చూస్తే.. ఎవరి గుండె అయినా జారిపోవాల్సిందే. ఓ వ్యక్తి వెంట్రుక వాసిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. 

Motorcyclist Crashes In Front Of Approaching Truck. Then
Author
hyderabad, First Published Jan 28, 2022, 2:39 PM IST

రోడ్డు ప్రమాదం ఎప్పుడు ఎలా జరుగుతుందో ఎవరూ ఊహించలేరు.  మనం సవ్యంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా..  ఏదో ఒక రూపంలో ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. తాజాగా.. ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట  వైరల్ గా మారింది. ఈ వీడియో చూస్తే.. ఎవరి గుండె అయినా జారిపోవాల్సిందే. ఓ వ్యక్తి వెంట్రుక వాసిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.  ఎంత అదృష్టం ఉంటే.. ఇలాంటి ప్రమాదం నుంచి తప్పించుకోవాలో... ఈ సంఘటన మలేషియాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  అక్కడ అప్పటికే వర్షం పడుతుంది. మామూలుగానే వర్షం పడితే.. రోడ్లు జారుతాయి కదా.. ఓ మోటర్ బైక్ నడిపే వ్యక్తి విషయంలోనూ అదే జరిగింది. పాపం.. అనుకోకుండా రోడ్డుపై జారి కింద పడిపోయాడు.  వెంటనే వెనక నుంచి.. ఓ ట్రక్కు అతని వైపు దూసుకువచ్చింది. అయితే.. ఆ వ్యక్తి పడిపోయినా కూడా.. అతని బుర్ర వేగంగా పనిచేస్తోంది. వెంటనే ఒక్క ఉదుటున లేచి పక్కకి పరిగెత్తాడు. అతను లేవడం ఒక్క సెకను ఆలస్యమైనా అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. ఈ వీడియో  చూసిన వారికి కూడా  టెన్షన్ రావడం ఖాయం. కావాలంటే.. మీరు కూడా ఈ వీడియో పై ఓ లుక్కేయండి.TRT World Now అనే యూట్యూబ్ పేజీలో ఈ వీడియోని మొదట పోస్టు చేయడం గమనార్హం. . 

 

 

సదరు వ్యక్తిని అదృష్టవంతుడు.. చాలా త్వరగా రియాక్ట్ అయ్యాడని..లేదంటే పెద్ద ప్రమాదం జరిగేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios