ఎంత మంది ఉంటే ఏంటి..? అమ్మను ఇట్టే పట్టేస్తా.. చిన్నారి వీడియో వైరల్..!

 ఆ చిన్నారి వాళ్ల అమ్మను గుర్తించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Mother tries to trick toddler by hiding among women dressed in similar sarees in viral video. See what happened next

ఈ ప్రపంచంలో అన్నింటి కంటే.. తల్లి, బిడ్డ ల బంధం ఎంతో గొప్పది. పుట్టిన బిడ్డ.. కేవలం స్పర్శతోనే తన తల్లిని గుర్తు పట్టగలదు.  ఎంత మంది ఉన్నా.. కేవలం స్పర్శతో.. తన తల్లి ఎవరో గుర్తించగలదు. అందుకు ఈ వీడియో కూడా ఒక ఉదాహరణ. సంవత్సరం లోపు ఓ చిన్నారిని... తన తల్లిని గుర్తు పట్టాడు.

అయితే.. ఆ చిన్నారిని కన్ఫ్యూజ్ చేసేందుకు.. తల్లి సహా.. కొందరు మహిళలు ఒకేలాంటి దుస్తులు ధరించి.. ముఖానికి పరదా వేసుకున్నారు. అయినప్పటికీ.. ఆ చిన్నారి వాళ్ల అమ్మను గుర్తించడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మార్చి 6వ తేదీన ఈ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా.. ఇప్పటికే 18 మిలియన్ల మంది వీక్షించడం గమనార్హం. ఈ వీడియో చూసినవారంతా ఫిదా అయిపోతున్నారు.

ఈ వీడియోలో...  ఒక పసి పిల్లాడిని.. గదిలోకి తీసుకువచ్చి వదిలిపెట్టారు.  అక్కడ నలుగురు మహిళలు పసుపు రంగు చీర ధరించి.. ముఖానికి ముసుగు వేసుకున్నారు. చేతులు ఒక్కటి బయట పెట్టి.. ఆ చిన్నారిని పిలుస్తూ సైగలు చేశారు. ఆ నలుగురిని చూసిన చిన్నారి.. ముందుగా ఓ మహిళ దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించి.. మళ్లీ ఆగి.. తన తల్లి దగ్గరకు వెళ్లడం గమనార్హం. వెంటనే వెళ్లి.. తన తల్లి ఒడిలో కూర్చున్నాడు. అంతే.. ఎంతో క్యూట్ గా ఉన్న ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కావాలంటే.. మీరు కూడా ఈ వీడియో ఒకసారి చూసేయండి..

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SFT (@status.fan.tranding)

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios