పాపం ఆ పిల్లాడికి నిండా పదేళ్లు కూడా లేవు. బెలూన్స్ అమ్ముకుంటూ.. టీ దుకాణంలో పనిచేసుకుంటూ తనని తాను పోషించుకోవడంతోపాటు.. ఓ కుక్కను కూడా పోసిస్తున్నాడు. ఆ చిన్నారి తండ్రి జైలు పాలు కాగా.. తల్లి ఆ పిల్లాడిని వదిలేసి వెళ్లిపోయిందట. అప్పటి నుంచి అక్కడే ఉంటూ.. తనతోపాటు కుక్కని కూడా పోషిస్తున్నాడు. కాగా.. ప్రస్తుతం ఈ చిన్నారి కుక్కతో ఉన్న ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సంఘటన ముజఫర్ నగర్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ముజఫర్ నగర్ కి చెందిన అంకిత్ అనే చిన్నారి ఉన్నాడు. ఆ చిన్నారి వయసు తొమ్మిది లేదా పది సంవత్సరాలు ఉండొచ్చు. కాగా.. ఆ పిల్లాడు ఒంటరిగా కుక్కతో కలిసి జీవిస్తున్నాడు. ఓ చిన్న సందులో కుక్కపిల్లతో కలిసి దుప్పటి కప్పుకొని పడుకొని కనిపించాడు. ఆ సన్నివేశం ఓ జర్నలిస్ట్ దానిని ఫోటో తీయగా.. అది కాస్త వైరల్ గా మారింది.

ఆ కుక్క పేరు డ్యానీ కాగా.. చిన్నప్పటి నుంచి అది ఆ పిల్లాడితోనే ఉండటం గమనార్హం. ఆ చిన్నారి తండ్రి ఏదో నేరం కింద జైలుకి వెళ్లాడని.. ఆ తర్వాత అతని తల్లి వదిలేసి వెళ్లిపోయిందని తర్వాత తెలిసింది. ప్రస్తుతం ఆ చిన్నారిని, కుక్కని ముజఫర్ పోలీస్ స్టేషన్ లో ఉంచారు.

ఆ పిల్లాడి తల్లిదండ్రుల కోసం గాలిస్తున్నారు. అయితే.. పోలీసులు ఆ కుక్కకి పాలుపెడతామన్నా కూడా,... ఆ చిన్నారి అంకిత్.. నిరాకరించడం గమనార్హం. ఉచితంగా తాను ఏదీ తీసుకోనని  చెప్పాడట. ఆ చిన్నారి చెప్పిన మాటకు అందరూ ఫిదా అయిపోయారు. కాగా.. ప్రస్తుతం ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎక్కడున్నారా అని వెతికే పనిలోపడినట్లు పోలీసులు చెప్పారు.