టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ షమీ... బౌలింగ్ కి తిరుగు లేదు. మైదానంలో అడుగుపెట్టాడంటే తన ఫాస్ట్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. అయితే... ఓ విషయంలో మాత్రం తన కుమార్తె  ఆయనను మించిపోయిందట. ఏ విషయంలో అనుకుంటున్నారు..? డ్యాన్స్ లో. ఈ విషయాన్ని షమీనే స్వయంగా వెల్లడించాడు. తన ముద్దుల కుమార్తె ఓ భోజిపురి సాంగ్ కి డ్యాన్స్ వేస్తుండగా... ఆ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు.

తన కన్నా మంచిగా డ్యాన్స్ వేస్తుందంటూ కితాబు కూడా ఇచ్చాడు. కూతురిని మై డాల్ అంటూ సంబోధించాడు. కాగా... ఈ వీడియోకి అభిమానుల నుంచి కూడా అనూహ్య స్పందన వస్తోంది. డ్యాన్స్ చాలా బాగా వేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భార్యతో ఎన్ని గొడవలు ఉన్నా... కూతురిపై మాత్రం షమీ ప్రేమ చూపించడాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.

కాగా... షమీ గత ఏడాది మార్చి నుంచి వరుస వివాదాలు చుట్టుముట్టాయి. మొదట ఆయన భార్య అతడిపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు. తర్వాత గృహ హింస, కొట్టారని, అత్యాచారం చేశారని కేసులు పెట్టారు. హసీన్ జహా ఆరోపణల తర్వాత భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) గత ఏడాది మొహమ్మద్ షమీని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించింది.

తర్వాత అతడికి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శనతో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో షమీకి చోటు లభించలేదు. అదే సమయంలో అతడు ఒక రోడ్డు ప్రమాదానికి కూడా గురయ్యాడు.

భార్య పెట్టిన గృహ హింస కేసులో కోల్‌కతా పోలీసులు గత ఏడాది ఐపీఎల్ టోర్నీ సమయంలో షమీని విచారించారు. అయితే షమీ మొదటి నుంచీ తనపై వస్తున్న ఆరోపణలు నిరాధారమని చెబుతున్నాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My doll. Has much better dances skills than her father.💃#dance #futurestar #india.

A post shared by Mohammad Shami (@mdshami.11) on Oct 11, 2019 at 5:57am PDT