క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తే.. ప్రశ్నలన్నీ ఓ సూపర్ హిట్ సినిమా గురించే.. కంగుతిన్న విద్యార్థులు.. కట్ చేస్తే...
సినిమాలు జీవితాల్లో భాగం అయిపోయాయి. సినిమా గురించి ఏ ప్రశ్న అడిగినా టక్కున చెప్పేస్తారు. అదే టెక్ట్ బుక్ లో క్వశ్చన్ అడిగితే నీళ్లు నములుతారు. అలా అనుకునేనేమో ఆ కాలేజీ యాజమాన్యం ప్రశ్నాపత్రం అంతా ఓ సూపర్ హిట్ మూవీ గురించే ఇచ్చింది. దీంతో పరీక్ష రాద్దామని కూర్చున్న విద్యార్థులు కంగుతిన్నారు.. చివరికి ఏమైందంటే..
కేరళ : examsల్లో సమాధానాలు తెలియకపోతే.. Movie Storyని పేపర్లో నింపివచ్చావా? అంటూ ఆటపట్టిస్తాం. మరి పరీక్షలో సబ్జెక్ట్ కి సంబంధించిన questions కాకుండా… సినిమా ఆధారంగా ప్రశ్నలే అడిగితే… ఏంటీ ఇలా కూడా జరుగుతుందా? అయితే భలేగా రాసేయచ్చు.. అని ఆశ్చర్యపోతున్నారా? అవును ఇలాంటి ఓ ఘటనే keralలో జరిగింది.
ఇంతకీ ఏమైందంటే.. కేరళలోని మార్ అథనాసియస్ Engineering College విద్యార్థులకు మూడో సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి.
Mechanical of Fluids అనే సబ్జెక్టులో 50 మార్కుల ప్రశ్నాపత్రమంతా మలయాళం సూపర్ హిట్ మూవీ ‘Minnal Murali’ కథని ఆధారంగా చేసుకుని ఇచ్చారు. అది చూసిన విద్యార్థులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. చివర్లో ఒక డిస్క్లైమర్ చూసి మరింత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. ‘ప్రశ్నాపత్రం కల్పితం.. అని విమర్శించాలనుకుంటే తర్వాత విమర్శించండి. ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్ ని ఎంజాయ్ చేయండి’ అని రాసుంది. ఈ ఫోటోలు కాస్త నెట్టింట viral అవ్వడంతో విభిన్నంగా స్పందిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు జరగడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలోనూ సినీ నటులు కరీనా కపూర్ -సైఫ్ అలీఖాన్ తనయుడి పూర్తి పేరు ఏమిటి? అంటూ మధ్యప్రదేశ్ లోని ఖండవాలోని ఓ ప్రైవేటు పాఠశాలలో జనరల్ నాలెడ్జ్ పరీక్షలో భాగంగా ఆరో తరగతి విద్యార్థుల ప్రశ్నపత్రంలో అడిగారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారడంతో అక్కడి జిల్లా విద్యాధికారి సదరు పాఠశాల యాజమాన్యానికి నోటీసులు పంపారు.
ఇదిలా ఉండగా, biharలో సిబ్బంది వైఫల్యం కారణంగా ఫిబ్రవరి 2న దాదాపు 400 మంది పన్నెండవ తరగతి విద్యార్థులు Car headlightsవెలుతురులో పరీక్ష రాయాల్సి వచ్చింది. మోతిహరిలోని Maharaja Harendra Kishore Singh Collegeలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…
బీహార్ వ్యాప్తంగా ఫిబ్రవరి 2న 12వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి Hindi Exam. రెండు భాగాలుగా నిర్వహించారు. తొలిభాగం పరీక్ష ఉదయం జరగ్గా.. రెండో పేపర్ షెడ్యూల్లో మధ్యాహ్నం 11 గంటల 45 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించారు. అయితే మహారాజా హరేంద్ర కిషోర్ సింగ్ పరీక్షా కేంద్రంలో ముందస్తుగా విద్యార్థుల సీటింగ్ ఏర్పాటు చేయకపోవడంతో గందరగోళం తలెత్తింది. దీంతో విద్యార్థులు, వారి తల్లి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ క్రమంలోనే పరీక్ష చాలా ఆలస్యంగా మొదలయ్యింది. విద్యార్థులకు Answer sheets అందేసరికి సాయంత్రం నాలుగున్నర గంటలు దాటింది. అప్పుడే అసలు సమస్య మొదలైంది. ఆ కాలేజీకి ఎలాంటి విద్యుత్ సరఫరా లేకపోవడంతో జనరేటర్లతో నడిపిస్తున్నారు. అయితే కొన్ని గదుల్లో ఆ సౌకర్యం కూడా లేక, కొంతమంది విద్యార్థులను కారిడార్లలో కూర్చోబెట్టారు. కానీ అప్పటికే Dark పడింది. దీంతో కార్లలో వచ్చిన కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు కారు హెడ్ లైట్లు ఆన్ చేయడంతో ఆ వెలుతురులో విద్యార్థులు పరీక్ష పూర్తి చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో రావడంతో ఇది వివాదాస్పదంగా మారింది. దీనిపై తూర్పు చంపారన్ జిల్లా కలెక్టర్ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కోసం జిల్లా విద్యాధికారి నేతృత్వంలోని కమిటీని నియమించినట్లు తెలిపారు.