ఢిల్లీ మెట్రోలో దారుణంగా కొట్టుకున్న వ్యక్తులు.. వీడియో వైరల్..

ఢిల్లీ మెట్రో కోచ్‌లో ఇద్దరు వ్యక్తులు దారుణంగా కొట్టుకుంటూ.. నెట్టుకుంటూ.. తిట్టుకుంటున్న వీడియో వైరల్ గా మారింది. 

Men fight slap, abuses in Delhi Metro,Video viral - bsb

ఢిల్లీ మెట్రో మరోసారి వార్తల్లో నిలిచింది.  గత కొన్ని నెలలుగా రకరకాల కారణాలతో వార్తల్లోకి ఎక్కుతోంది. వివాదాస్పదంగా మారుతోంది. అయితే, ఇదే డ్యాన్స్ రీల్స్ వల్లో..ఇంకేదైనా మంచి కారణానికో కాదు.. అనుచిత ప్రవర్తనకు.. మెట్రోలో ముద్దులు పెట్టుకోవడాలు.. కౌగిలింతలు, హస్తప్రయోగాలు.. ఇలాంటి అనేక అభ్యంతకరకారణాలతో వార్తల్లో నిలుస్తోంది. 

ఇప్పుడు ఓ ఇద్దరు వ్యక్తులో మెట్రో కోచ్‌లో అగ్లీ ఫైట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ప్రయాణికులు కొట్టుకుంటున్న ఈ ఇద్దరు వ్యక్తులకు దూరంగా నిలబడి చూస్తున్నారు.మరికొందరు జోక్యం చేసుకుని వారి గొడవను ఆపడానికి, వారిద్దరికీ సర్ది చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు.

పురుషులు ఒకరినొకరు కొట్టుకోవడం, దూరంగా నెట్టుకోవడానికి ప్రయత్నించడం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ) ఓ ప్రకటన విడుదల చేసింది.

"మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని కోరుతున్నాం. ఇతర ప్రయాణికులు ఏదైనా అభ్యంతరకరమైన ప్రవర్తనను గమనించినట్లయితే, వారు వెంటనే డీఎంఆర్సీ హెల్ప్‌లైన్‌ కి తెలియజేయాలి, ఇటీవల, డీఎంఆర్సీ ఫ్లయింగ్ స్క్వాడ్‌లను కూడా నియమించింది. దాని నెట్‌వర్క్‌లో మెట్రోలో ఇటువంటి ప్రవర్తనను యాదృచ్ఛికంగా పర్యవేక్షించడానికి, సంబంధిత చట్ట నిబంధనల ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవడానికి మెట్రో, సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు” అని డీఎంఆర్సీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ దయాల్ అన్నారు.

కాగా, ఈ వీడియోపై నెటిజన్లు మిశ్రమ స్పందనను వ్యక్తం చేస్తున్నారు.  ఒక వ్యక్తి "ఏంటిది.. గొడవ ఏదైనా ప్రశాంతంగా ఉండండి.. జీవితంలో తక్కువ సమస్యలు ఉన్నాయా?" అని అంటే.. మరొకరు  " డీఎంఆర్సీలో అన్ని వయసుల వారికి ఆనందం అందుబాటులో ఉంటుంది" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios