హ్యూమన్ డాగ్ : అలా ఉండడం నాకు ఇష్టం లేదు.. తేల్చి చెప్పిన ‘కుక్క’ మనిషి..
తనను తాను కుక్కలా మార్చుున్న జపనీస్ వ్యక్తి తనకు అలా జీవితాంతం ఉండడం ఇష్టం లేదని అన్నాడు.
జపాన్ : కొద్దిరోజుల క్రితం జపాన్ కి చెందిన ఓ వ్యక్తి కుక్కగా మారి వైరల్ అయిన విషయం తెలిసిందే. అతను కుక్కగా మారడంతో… ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. అతనికి చిన్నప్పటి నుంచి కుక్కలు అంటే చాలా ఇష్టం. దీంతో టోకో అనే ఆ వ్యక్తి కుక్కగా మారాలనుకున్నాడు. చిన్నపడినుండి అదే ఆశతో ఉన్న ఆ వ్యక్తి పెద్దయ్యాక తన కలను నిజం చేసుకున్నాడు. దీనికోసం అక్షరాల రూ.16లక్షలు ఖర్చుపెట్టి కుక్కగా మారాడు.
ఆ వేషంతో వీధుల్లో తిరుగుతూ జనాల్ని ఆటపట్టించాడు. నిజమైన కుక్కలతో స్నేహం కూడా చేశాడు. అలా అతను తనను తాను కుక్కగా మార్చుకున్నప్పటి నుంచి సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాడు. అయితో టోకో... కుక్కల మీద ఉన్న ప్రేమతో.. జీవితాంతం కుక్క గానే బతకాలనుకుంటున్నాడనే వార్త ఒకటి గుప్పుమంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అయింది.
హెచ్-1బీ వీసాలు నిరాకరించినందుకు అమెరికా ప్రభుత్వంపై 70 మంది భారతీయుల దావా
ఈ వార్తలను గురించి టోకో ఈ మధ్య వివరణ ఇచ్చాడు. తాను జీవితాంతం కుక్కగానే ఉండాలనుకుంటున్న దాంట్లో వాస్తవం లేదని తేల్చి చెప్పాడు. తన గురించి తప్పుడు ప్రచారం జరుగుతుందన్నాడు. తాను వారానికి ఒక్కసారి మాత్రమే కుక్కలాగా మారతానని చెప్పాడు. దీనికోసం ఆ కుక్క దుస్తుల్ని ధరిస్తానని తెలిపాడు. అది కూడా బయటికి వెళ్ళనని.. ఇంట్లో మాత్రమే ఉంటానని చెప్పుకొచ్చాడు.
తనకు కుక్కలు అంటే ఎంతో ఇష్టం. అందుకే ఇలా కుక్కలా మారాలి అనుకున్నాను. అంతే తప్ప.. జీవితకాలం కుక్కలాగే ఉండాలని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోందని.. అది ఇప్పుడు తీసింది కాదని... గత సంవత్సరం వీడియో అని చెప్పాడు. అయితే…తన వీడియోకి ఆ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని తాను కూడా ఊహించలేదన్నాడు. అంతేకాదు కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే తను కుక్కలాగా మారతానని.. లైఫ్ లాంగ్ కుక్క దోస్తుల్లోనే ఉండాలన్న ఆసక్తి తనకు లేదని ఇంకోసారి క్లియర్ గా క్లారిటీ ఇచ్చాడు.
టోకోకి కూడా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అభిరుచి ఉన్నట్టుగా… కుక్కలాగా మారడం అనే అభిరుచి ఉంది. అయితే అది అంత సులభంగా జరిగేది కాదు. అందుకోసమే.. ముందుగా డబ్బు సంపాదించడం మీద అతను దృష్టి సారించాడు. అలా కొంత మొత్తాన్ని జమ చేసుకొని…జెపెట్ అనే ఓ సంస్థను కలిశాడు. కుక్కలాగా కనిపించే దుస్తులు తయారు చేయాలంటూ కోరాడు.
అతను చెప్పిన ప్రకారంగా.. నిజమైన కుక్కలా భ్రమింప చేసేలా దుస్తులు తయారు చేయడానికి వారు కొని వారాల పాటు శ్రమించారు. చివరికి అతనికి అందించారు. అవి చూసిన టోకో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. నిజమైన కుక్కలాగే కనిపించడంతో.. వాటిని వేసుకుని ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అట్లా దుస్తులు వేసుకొని కుక్కలతో స్నేహం చేయడం కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది.