పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నారు పెద్దలు. దీనికి తగట్టే.. కొందరు వింత వింతగా ఆలోచిస్తుంటారు. ఇలానే ఓ వ్యక్తి తాను చేసిన వింత ఆలోచన కారణంగా... పోలీసుల చేతికి చిక్కాడు. తన పెంపుడు కుక్కకి డ్రైవింగ్ నేర్పించాలని అనుకున్నాడు. ఈ క్రమంలో బీభత్సం సృష్టించేశాడు. దీంతో.. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన అమెరికాలోని వాషింగ్టన్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఆదివారం మధ్యాహ్నం.. వాషింగ్టన్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. గంటకు 160కిలోమీటర్ల వేగంతో వెళుతూ... రోడ్డుపై వెళ్తున్న మరో రెండు కార్లను ఢీ కొట్టింది. ప్రమాదం చేసిన తర్వాత కూడా కారు ఆగకుండా వెళుతూనే ఉంది. దీంతో.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

Also Read కరోనా దెబ్బ: వాట్సాప్ వినియోగదారులకు పెద్ద షాక్!...

పోలీసులు వెంటనే ఆ కారును ఛేజ్ చేసి పట్టుకున్నారు. తీరా కారులో జరుగుతున్నది చూసి షాకయ్యారు. డ్రైవర్ సీటులో కుక్క కూర్చొని.. స్టీరింగ్ తిప్పుతుండగా.. కారు యజమాని పక్క సీటులో కూర్చొని మిగిలిన వాటిని హ్యాండిల్ చేస్తున్నాడు.

ఏమిటిది అని పోలీసులు సదరు వ్యక్తిని ప్రశ్నించగా.. తన కుక్కకి డ్రైవింగ్ నేర్పుతున్నానని చెప్పడం గమనార్హం. కాగా.. ఆ సమయంలో అతను డ్రగ్స్ కూడా తీసుకొని ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.