Asianet News TeluguAsianet News Telugu

పెద్ద కొండచిలువులు.. తోక పట్టుకొని లాక్కెళ్లిన వ్యక్తి ...!

అందులో అతను రెండు అతి పెద్ద  కొండచిలువలను పట్టుకున్నాడు. ఒకటి తెల్లది, మరొకటి నల్లది. ఈ రెండింటి తోకలు పట్టుకొని అతను లాక్కొని వెళుతున్నాడు.

Man Pulls Two Giant Pythons By Their Tails
Author
First Published Mar 16, 2023, 12:03 PM IST

మనలో చాలా మంది పామును అంత దూరంలో చూస్తేనే పారిపోతూ ఉంటారు. పాము దగ్గరకు వచ్చిందా... ఇక పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఓ వ్యక్తి అతి పెద్ద కొండ చిలువలు. వాటిని చూస్తేనే గుండె ఆగిపోయేలా ఉన్నాయి. అలాంటి రెండు కొండ చిలువల తోకలు పట్టుకొని లాక్కెళ్లాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 

 అమెరికన్ యూట్యూబర్ , రెప్టైల్ జూ ప్రీహిస్టారిక్ ఇంక్ వ్యవస్థాపకుడు, CEO జే బ్రూవర్ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేసారు, అందులో అతను రెండు అతి పెద్ద  కొండచిలువలను పట్టుకున్నాడు. ఒకటి తెల్లది, మరొకటి నల్లది. ఈ రెండింటి తోకలు పట్టుకొని అతను లాక్కొని వెళుతున్నాడు.

వాటిని లాక్కెళ్తున్న వీడియోని తన సోషల్ మీడియా ఎకౌంట్ లో స్వయంగా షేర్ చేశాడు. ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసి నెటిజన్లు సైతం భయపడుతున్నారు.  అంత ధైర్యంగా ఆ పాములను ఎలా పట్టుకున్నావ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. 3 మిలియన్లకు పైగా ఆ వీడియోకి వ్యూస్ రావడం విశేషం.

Follow Us:
Download App:
  • android
  • ios