చాలా వరకు మ్యాజిక్స్.. ఎలా చేశారు అనే విషయాన్ని కనిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఇతను చేసిన మ్యాజిక్ చేస్తే.. కనీసం ఎలా చేశాడో చెప్పడం కూడా చాలా కష్టం.

ఇంటర్నెట్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ ఇంటర్నెట్ కాలంలో.. ఇప్పటి వరకు చాలా రకాల వీడియోలు వైరల్ గా మారాయి. అందులో మ్యాజిక్ చేసిన వారు కూడా ఉండి ఉండొచ్చు. అయితే.. తాజాగా ఓ వ్యక్తి కూడా చేతిలో పంచదారతో మ్యాజిక్ చేశాడు. కానీ... అతని మ్యాజిక్ కి ఇంటర్నెట్ వ్యూవర్స్ అంతా షాకైపోయారు. చాలా వరకు మ్యాజిక్స్.. ఎలా చేశారు అనే విషయాన్ని కనిపెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ.. ఇతను చేసిన మ్యాజిక్ చేస్తే.. కనీసం ఎలా చేశాడో చెప్పడం కూడా చాలా కష్టం.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

Scroll to load tweet…

ఈ వీడియోలను జాడన్ రే అనే వ్యక్తి టిక్ టిక్ లో షేర్ చేయగా.. వాటిని నెటిజన్లు.. ఇతర సోషల్ మీడియా వెబ్ సైట్లలోనూ షేర్ చేశారు. ఈ క్రమంలో.. అతనివి రెండు, మూడు వీడియోలు ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

ఈ వీడియో మొదట టిక్‌టాక్‌లో జాడోన్ రే పోస్ట్ చేశారు. 16-సెకన్ల క్లిప్‌లో.. ఒక వ్యక్తి తన నోటిలో సాచెట్‌ను పట్టుకుని చక్కెర పొట్లాన్ని చింపి ఎడమ చేతిలో పోసుకోవడం చూడవచ్చు. ఆ తర్వాత పంచదారను గాలిలోకి విసిరి నోటిలోంచి పొట్లం కవర్ ను నోటి నుంచి బయటకు తీశాడు. అనంతరం ఆ వ్యక్తి చక్కెరను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తన కుడి చేతిని ఆకాశం వైపు చూపించాడు.. చేతిలోని పంచదారను అద్భుతంగా క్యాచ్ చేసినట్లు.. చేసి తిరిగి పంచదారను ప్యాకెట్‌లో పోశాడు.

Scroll to load tweet…

మరో వీడియోలో... కారుకు ఒక వైపు నుంచి పంచదార విసిరేసి.. మరో వైపు వెళ్లి క్యాచ్ పట్టాడు. గాలిలోకి విసిరిన పంచదార అతను ఎలా క్యాచ్ పట్టాడో ఎవరికీ అర్థం కావడం లేదు. వీడియో కి మాత్రం మిలియన్ల వ్యూస్ రావడం గమనార్హం.

ఈ వీడియో చూసి ఓ నెటిజన్ స్పందిస్తూ.. “నేను దీన్ని 57 సార్లు చూశాను, ఇప్పటికీ మ్యాజిక్ ఎలా చేశాడు నేను గుర్తించలేకపోయాను” అని కామెంట్ చేశాడు.