ఈడు మగాడ్రా బుజ్జీ... 28 మంది భార్యలు, 35 మంది పిల్లలు, 126 మంది మనవళ్ల సమక్షంలో.. 37వ పెళ్లి..

సోషల్ మీడియాలో ఓ వీడియో చూసి ఇప్పుడంతా.. వీడు మగాడ్రా బుజ్జీ.. అనుకుంటున్నారు. ఎందుకంటే పెళ్లి అంటేనే భయంతో పరిగెడుతున్న నేటి యూత్ కు.. ఆ వీడియోలోని వ్యక్తి 37వ సారి పెళ్లి చేసుకుంటున్నాడని తెలియడమే. 

Man marries 37th time in front of 28 wives, 35 children and 126 grandchildren, video goes viral

28 మంది భార్యలు, 35 మంది పిల్లలు, 126 మంది మనవళ్ల ముందు ఓ వ్యక్తి  37వ పెళ్లి చేసుకున్నాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. చూసిన నెటిజన్లు మాత్రం ఒక్కర్ని మెయింటేన్ చేయడానికే కుదరడం లేదు.. ఇంతమందా? అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. 

ఈ వీడియోను.. ‘అత్యంత ధైర్యసాహసాలు కలిగిన సజీవ వ్యక్తి..  28 మంది భార్యలు, 135 మంది పిల్లలు,126 మంది మనవళ్ల ముందు 37వ పెళ్లి చేసుకున్న వ్యక్తి" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేశారు. 

ఈ వీడియోను ట్విట్టర్ లో ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలోని వ్యక్తికి ఇది 37వ పెళ్లి. ఆయన 28 మంది భార్యలు, 35 మంది పిల్లలు, 126 మంది మనవరాళ్లు వివాహ వేడుకకు హాజరయ్యారు.

పూర్వ కాలంలో రాజులు ఇలా పదులకొద్ది మహిళల్ని పెళ్లి చేసుకోవడం కనిపించేది. నేటి కాలంలో ఒక్కరిని పెళ్లి చేసుకోవడం ఎక్కువ. ఇంకా చెప్పాలంటే అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం కూడా గగనం అయిపోతోంది. అలాంటి సమయంలో ఈ వ్యక్తి 37 పెళ్లిళ్లు చేసుకోవడం.. వైరల్ గా మారడంలో తప్పేలేదు. 

రాజులు డజన్ల కొద్దీ రాణులను వివాహం చేసుకోవడం అనేది మనందరం ఎదుగుతున్నప్పుడు వినే విషయం, కానీ ఆధునిక కాలంలో చాలా మంది జీవిత భాగస్వాములు ఉండాలనే ఆలోచన నిజంగా విచిత్రమైనది. అయితే 37వ పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి కోసం కాదు.

అయితే,ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో తెలియరాలేదు.
గతేడాది జూన్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియో మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

‘ఒక్క పెళ్లి చేసుకుని.. ఒక్క పెళ్లాన్ని భరించడమే కష్టంగా ఉంది’, ‘ఒక్కపెళ్లి చేసుకోవాలంటేనే భయమేస్తుంది.. ఇదేందయ్యా.. 37మందిని ఎలా చేసుకున్నావ్’, ‘ఒంటరి పక్షులు చూస్తే.. దెబ్బకు స్వర్గస్తులవుతారు’.. అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios