గూగుల్‌లో ఉద్యోగాన్ని విడిచిపెట్టి, ఉబెర్ డ్రైవర్ గా మారి.. బెంగళూరులో చక్కర్లు.. వీడియో వైరల్..

బెంగళూరు నగరాన్ని ఎక్స్ ప్లోర్ చేయడం కోసం.. హైదరాబాద్ లోని గూగుల్ జాబ్ ను వదులుకుని.. ఉబర్ మోటో డ్రైవర్ గా మారాడో వ్యక్తి. 

Man left his job at Google and became an Uber driver in Bangalore, Video viral - bsb

బెంగళూరు : ప్రత్యేక సంస్కృతి, ఆకర్షణకు ప్రసిద్ధి చెందింది బెంగళూరు. బెంగళూరు అనగానే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది ఐటీ రంగం. బెంగళూరు ఐటీ రంగం దేశవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్షిస్తుంది. అనేక చిత్రవిచిత్రకథనాలకు కూడా బెంగళూరు నిలయం.. అలాంటి ఓ ఆసక్తికరమైన స్టోరీనే ఇది. బెంగళూరు నగరాన్ని చూడడానికి హైదరాబాద్ నుంచి వెళ్లిన ఓ వ్యక్తి అక్కడ ఉబర్ డ్రైవర్ గా మారాడు.

అంటే బతకడం చేతకాక కాదు.. బెంగళూరు నగరాన్ని ఎక్స్ ప్లోర్ చేయడానికి హైదరాబాద్ లో గూగుల్ కంపెనీలో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి మరీ ఉబర్ డ్రైవర్ గా మారాడు. ఆ స్టోరీని రాఘవ్ దువా అనే ఎక్స్ యూజర్ పోస్ట్ చేశాడు. దీంతో పాటు ఉబెర్ మోటో డ్రైవర్‌తో తాను రైడింగ్ చేస్తున్న వీడియోను కూడా పోస్ట్ చేశాడు."నగరాన్ని అన్వేషించడానికి" తాను హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్లినట్లు అతను చెప్పాడు. ఆదివారం షేర్ చేసిన ఈ పోస్ట్ 63,000 కంటే ఎక్కువమంది చూశారు.

గార్బా వేడుకల్లో విషాదం.. కూతురిని వేధించిన వ్యక్తులతో గొడవ పడి తండ్రి మృతి..

"నా ఉబెర్ మోటో డ్రైవర్ మాజీ గూగుల్ ఉద్యోగి.. హైదరాబాద్ నుండి 20 రోజుల క్రితం బెంగుళూరుకు మారాడు. అతను నగరాన్ని అన్వేషించడానికి ఇలా చేస్తున్నాడు" అని దువా తన పోస్ట్‌లో తెలిపారు. ఇది చూసిన మిగతా యూజర్స్ కూడా ఈ పోస్ట్‌ కు ఆకర్షితులయ్యారు. బెంగళూరులో వారి స్వంత అనుభవాన్ని పంచుకున్నారు.

దీనిమీద రకరకాలుగా నెటిజన్లు స్పందించారు. "ఇది నిజంగా భలే ఉంది. మీ రైడ్ సమయంలో మీరు ఆసక్తికరమైన సంభాషణ చేశారనుకుంటున్నాను’ అని ఒకరు అంటే... "అవును నాకు కూడా ఇలాంటి అనుభవం ఉంది’ అని మరొకరు అన్నారు. 

చాలామంది  దీనిని మరో 'పీక్ బెంగళూరు' అని చెప్పుకొచ్చారు. ఈ నెల ప్రారంభంలో, బెంగుళూరులోని రద్దీ వీధుల్లో బైక్‌పై పిలియన్‌ను నడుపుతున్నప్పుడు ఒక మహిళ తన ల్యాప్‌టాప్‌లో పని చేస్తున్న వీడియో ఒకటి వెలుగు చూసింది. ఈ వీడియో రెడ్డిట్‌లో పోస్ట్ చేయబడింది. ఆ తరువాత ఆన్‌లైన్‌లో షేర్ అయ్యింది. 

బెంగళూరులోని ఓ ఆటోరిక్షా డ్రైవర్ కథ కూడా కొన్ని వారాల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయింది. MoMoney సహ వ్యవస్థాపకుడు మనస్వి సక్సేనా, యూపీఐ యాప్ జుస్పే, పేమెంట్ యాప్ యాజమాన్యంలోని ఆటో యాప్ నమ్మ యాత్రి రెండింటిలోనూ తన ఉబెర్ డ్రైవర్ ఎలా పనిచేశాడో పంచుకున్నారు. "ఈరోజు రాత్రి నా ఉబెర్ ఆటో డ్రైవర్ జుస్పేలో చీఫ్ గ్రోత్ ఆఫీసర్‌గా ఉన్నారు, నమ్మ యాత్రి కోసం యూజర్ రీసెర్చ్ చేస్తున్నారు. ఇది బెంగుళూరు పీక్ కాకపోతే ఏముంటుంది" అని యూజర్ చెప్పారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios