మద్యపానం ఆరోగ్యానికి హానికరం..ఈ విషయం ఆ మద్యం సీసాలపైనే స్పష్టంగా రాసి ఉంటుంది. అయినా.. చాలా మంది తాగేస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని పక్కన పెడితే.. ఓ వ్యక్తి మితిమీరి మద్యం తాగేసి.. తర్వాత కనీసం యూరిన్ కి కూడా వెళ్లకుండా ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాకు చెందిన 40ఏళ్ల హూ ఓ రోజు రాత్రి ఒకటి కాదు.. రెండు కాదే ఏకంగా  10బీర్లు తాగాడు. తాగిన తరువాత యూరిన్ కి కూడా వెళ్లలేదు. అతనికి యూరిన్ వచ్చినా ఆపుకున్నాడు. అలా మత్తులోనే నిద్రపోయాడు. దాదాపు ఆ మత్తులో యూరిన్ కు వెళ్లకుండా 18గంటలు పడుకున్నాడు. 18గంటల తరువాత కడుపులో తీవ్రంగా నొప్పిరావడంతో..ఆ నొప్పితో ఆస్పత్రికి వెళ్లాడు. 

అన్నీ వైద్య పరీక్ష చేసిన డాక్టర్లు బాధితుడి మూత్రాశయం పగిలిపోయిందని చెప్పారు. అన్ని గంటలు యూరిన్ వెళ్లకుండా ఆపుకున్నందుకే ఇలా జరిగిందని వైద్యులు తెలిపారు. మద్యం తాగిన వెంటనే యూరిన్ కు వెళ్లాలని, లేదంటే తాగిన మద్యం మూత్రాశాయంలోకి వెళ్లి ప్రమాదాన్ని కలిగిస్తుందని డాక్టర్లు చెప్పారు.