Asianet News TeluguAsianet News Telugu

నీటిలో పాము.. వీడియో తీస్తుండగా...!

ఆ వీడియో చూసినా చాలా మందికి భయం పుట్టడం ఖాయం. ఎందుకంటే.. పాము.. నీటిలో ఈదుకుంటూ ఆ వీడియో తీస్తున్న వ్యక్తి దాకా వచ్చి.. ఆఖరికి పడవలో కూడా తలపెట్టింది. ఆ తర్వాత వెళ్లిపోయింది.

Man Films Huge Sea Snake Swimming Up To Him
Author
Hyderabad, First Published Sep 3, 2021, 4:56 PM IST

మన ముందు పాము పాక్కుంటూ వెళ్తుంటే చూస్తే చాలు.. చాలా మందికి గుండె జారి కిందకు వచ్చినంత పని అవుతుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం.. తన వెంట పడుతున్న పాముని వీడియోలో బంధించాడు. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఆ వీడియో చూసినా చాలా మందికి భయం పుట్టడం ఖాయం. ఎందుకంటే.. పాము.. నీటిలో ఈదుకుంటూ ఆ వీడియో తీస్తున్న వ్యక్తి దాకా వచ్చి.. ఆఖరికి పడవలో కూడా తలపెట్టింది. ఆ తర్వాత వెళ్లిపోయింది.

బ్రాడీ మోస్ అనే యూట్యూబర్ ఈ వీడియో షేర్ చేశాడు. సాధారణంగా నీటి పాములు మనుషుల జోలికి రావని ఈ వీడియోలో బ్రాడీ చెప్పడం వినిపిస్తుంది. కానీ ఏడాదిలో ఈ సమయంలో మాత్రం అవి జత కోసం వెతుకులాడుతూ ఉంటాయట. చాలా చిరాకు పడుతూ ఉండటంతోనే అది తనను వెంబడించిందని బ్రాడీ వివరించాడు. ట్విట్టర్‌లో కూడా ఈ వీడియో బాగా వైరల్ అయింది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by YBS (@brodiemoss)

ఇలాంటి సముద్రపు పాములు నీటి లోపల 250 అడుగుల లోతుకు వెళ్లి కనీసం 8 గంటలు గడిపేస్తాయని తెలుస్తోంది. కాగా ఈ వీడియోను చూసి నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios