Asianet News TeluguAsianet News Telugu

రొమాంటిక్ ప్రపోజల్.. నీళ్లల్లో జారి పడిపోయి...

పాపం.. ఓ వ్యక్తి కూడా అలానే తన ప్రేమను రొమాంటిక్ వేలో తెలియజేయాలని అనుకున్నాడు. కానీ అదికాస్త బెడసికొట్టింది. ప్రపోజల్ సంగతి దేవుడు ఎరగ.. వెళ్లి నీళ్లల్లో పడిపోయాడు. ఈ సంఘటన మిచిగాన్ లో చోటుచేసుకుంది.

Man Falls Into Lake Right Before Proposing To Girlfriend. Video Is Viral
Author
Hyderabad, First Published Jul 10, 2020, 12:57 PM IST

ఈ ప్రియమైన వారికి తమ ప్రేమను వ్యక్తపరిచి తమ అనుబంధాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే.. అందరిలా కాకుండా..కాస్త భిన్నంగా తమ ప్రేమను తెలియజేయాలని కొందరు తహతహలాడుతారు.

అందుకోసం రొమాంటిక్ ఆలోచనలతో ముందుకు వస్తారు. ఇప్పటి వరకు చాలా మంది తమ ప్రేయసిలకు చాలా రొమాంటిక్ గా, భిన్నంగా ప్రపోజ్ చేసి.. నెట్టింట వైరల్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు.

పాపం.. ఓ వ్యక్తి కూడా అలానే తన ప్రేమను రొమాంటిక్ వేలో తెలియజేయాలని అనుకున్నాడు. కానీ అదికాస్త బెడసికొట్టింది. ప్రపోజల్ సంగతి దేవుడు ఎరగ.. వెళ్లి నీళ్లల్లో పడిపోయాడు. ఈ సంఘటన మిచిగాన్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మిచిగాన్ కి చెందిన జాక్సన్.. గత ఎంతోకాలంగా మారియాని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం తనకు చెప్పాలని ఎన్లో ప్లాన్స్ వేసుకున్నాడు.

 

తాను అనుకున్న రోజు రానే వచ్చింది. వెంటనే తన ప్రియురాలు మారియాని తీసుకొని మిచిగాన్ బీచ్ కి తీసుకువెళ్లాడు. అక్కడ ముందుగానే తాను ప్రిపరేషన్స్ చేసుకున్నాడు.

కాగా.. సరిగ్గా.. అన్నీ సిద్ధం చేసుకొని.. రొమాంటిక్ గా.. బీచ్ వద్ద మోకాలిపై నిలబడి... తన ప్రియురాలికి రింగ్ ఇవ్వాలని అనుకున్నాడు అయితే.. అతని రొమాంటిక్ ప్రపోజల్ బెడసికొట్టింది.

ప్రపోజ్ చేయడానికి ముందే నీటిలో పడిపోయాడు. అతని ప్రేయసి ఉన్న చోటుకి వెళ్తుండగా జారి నీళ్లల్లో పడిపోయాడు. తర్వాత వెంటనే తేరుకొని పైకి లేచి.. మళ్లీ ప్రపోజ్ చేశాడు. అతని ప్రపోజల్ ని ఆమె వెంటనే ఒకే చేయడంతో విశేషం. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios