ఇదేం పిచ్చీ.. కుటుంబానికి గుణపాఠం చెప్పాలని చచ్చిపోయినట్టు ఫ్రాంక్.. అంత్యక్రియలకు హెలికాప్టర్‌లో వచ్చి..

డేవిడ్ బేర్టెన్ అనే బెల్జియన్ వ్యక్తి తాను మరణించినట్టు కుటుంబాన్ని నమ్మించాడు. ఆ తరువాత హెలికాప్టర్‌లో తన అంత్యక్రియలకు హాజరయ్యాడు. తన కుటుంబ సభ్యులకు గుణపాఠం చెప్పాలనే ఇలా చేశానని చెప్పుకొచ్చాడు.

man fakes his death to teach a lesson to family, arrives funeral in a helicopter - bsb

బెల్జియం : ఓ బెల్జియన్ వ్యక్తి తాను చనిపోయినట్టుగా కథ అల్లాడు. అలా కుటుంబాన్ని నమ్మించి, శోకసంద్రంలో ముంచాడు. టిక్‌టాక్‌లో రాగ్నార్ లే ఫౌ అని పిలువబడే డేవిడ్ బేర్టెన్ తన కుటుంబానికి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. అందుకే అతను ఈ పని చేశాడు. సొంతవారే తనను చిన్నచూపు చూడడం, అప్యాయతలు లోపించడం తో విసుగుచెంది ఇలా చేశాడట. 

 డేవిడ్ (45) అనే ఆ వ్యక్తి.. తన అంత్యక్రియలకు హెలికాప్టర్‌లో వచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పొలంలో దిగిన హెలికాప్టర్ నుంచి కిందికి వచ్చిన డేవిడ్ ను చూసి బంధువులు షాక్ అయ్యారు. ఆ తరువాత బంధువులు అతన్ని చుట్టుముట్టి కౌగిలించుకోవడం కనిపిస్తుంది. ఈ మొత్తాన్ని ఓ సినిమా బృందం షూట్ చేసింది కూడా. 

కుటుంబం మీద ఈ ఫ్రాంక్ చేయడానికి డేవిడ్ కూతుర్లు సహాయం చేశారు. అంత్యక్రియలకు ముందు సంతాప సందేశాలు కూడా చదివారు.  ‘డాడీ. నేను మీ గురించి ఆలోచించడం ఎప్పటికీ ఆపను" అని ఒక కూతురు రాస్తే..  "జీవితం ఎందుకు ఇలా అన్యాయంగా ఉంది? మీరు తాత కాబోతున్నారు, తెలుసా.. మీరింకా జీవించాల్సి ఉంది’ అని మరో కూతురు చదివింది. 

డేవిడ్‌ను కోల్పోయినందుకు సంతాపం వ్యక్తం చేయడానికి అనేక మంది బంధువులు వచ్చారు. వారంతా అతను జీవించి ఉన్నాడని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. డేవిడ్ హెలికాప్టర్ నుండి బయటకు వచ్చినప్పుడు స్వాగతం పలికారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios