విమానం నుంచి జారిపడిన ఐఫోన్.. విచిత్రమేమిటంటే..

బ్రెజిల్‌లోని రియో డి జెనెరియోకు చెందిన ఎర్నెస్టో గాలియొటొ 2వేల అడుగుల ఎత్తులో ఓ చిన్న‌పాటి విమానంలో డాక్యుమెంటరీ తీస్తున్నాడు. 

Man Drops iPhone From Plane. It Survives, Records Video Of Fall

చేతిలో నుంచి స్మార్ట్ ఫోన్ జారి కిందపడిన తర్వాత దాని ఆయుష్షు తగ్గిపోయిందనే చెప్పాలి. ఎందుకంటే దాదాపు ఎత్తు నుంచి కిందపడ్డాక  ఫోన్ పగలకుండా ఉండదు. అయితే..  ఓ వ్యక్తి మాత్రం ఏకంగా విమానం నుంచి ఫోన్ కిందకు జార విడిచాడు. ఇక ఆ ఫోన్ మీద ఎవరైనా ఆశలు వదులుకోవాల్సిందే. అయితే.. ఈ ఫోన్ విషయంలో మాత్రం విచిత్రం చోటుచేసుకుంది. ఫోన్ కి ఏమీకాకపోగా.. దానిలో నుంచి అద్భుతమైన వీడియో రికార్డు అయ్యింది. ఈ సంఘటన బ్రెజిల్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బ్రెజిల్‌లోని రియో డి జెనెరియోకు చెందిన ఎర్నెస్టో గాలియొటొ 2వేల అడుగుల ఎత్తులో ఓ చిన్న‌పాటి విమానంలో డాక్యుమెంటరీ తీస్తున్నాడు. అదే స‌మ‌యంలో త‌న ఐఫోన్ 6ఎస్ ఫోన్ ద్వారా ప్లేన్ నుంచి వీడియో తీస్తున్నాడు. అయితే బ‌లంగా వీచిన గాలికి అత‌ని చేతుల్లో ఉన్న ఐఫోన్ 6ఎస్ ఫోన్ కింద‌ప‌డింది. దీంతో ఫోన్ తుక్కుగా ప‌గిలి ఉంటుంద‌ని అత‌ను అనుకున్నాడు. కానీ అలా జ‌ర‌గ‌లేదు.

విమానం నుంచి ఫోన్ కింద ప‌డ‌గానే ఎర్నోస్టో ఫైండ్ మై ఐఫోన్ ద్వారా త‌న ఐఫోన్ ఎక్క‌డ ప‌డిందో గుర్తించాడు. అయితే ఫోన్‌ను చూసిన అత‌నికి ఆశ్చ‌ర్యం వేసింది. 2వేల అడుగుల ఎత్తు నుంచి కింద ప‌డినా ఫోన్ స్క్రీన్ గార్డ్ ప‌గిలింది కానీ.. ఫోన్‌కు అస‌లు చిన్న ప‌గులు కూడా ఏర్ప‌డ‌లేదు. దీంతో అక్క‌డ ఉన్న వారంద‌రూ షాక‌య్యారు. కాగా ఈ వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios