Asianet News TeluguAsianet News Telugu

ఇలాంటి వ్యాధులు కూడా ఉంటాయా.. అతని కడుపులో మద్యం ఊరుతోంది

తాను మద్యం సేవించకపోయినా... చేయని నేరం కింద అరెస్ట్ చేస్తుండటంతో పిచ్చి పట్టినట్లయ్యిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు

man arrested drunken drive discovers stomach brews alcohol in america
Author
New Jersey, First Published Jul 12, 2020, 9:34 PM IST

అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన డేనీ గియానోటో 2019లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో  పోలీసులకు పట్టుబడ్డాడు. కానీ తాను చుక్క మద్యం కూడా తాగలేదంటూ బాధితుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు.

అతని మాటను నమ్మని పోలీసులు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష చేస్తే ఫుల్లుగా తాగాడనే చూపించింది. అలా ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు ఏకంగా మూడుసార్లు కూడా అతను మద్యం తాగాడని రుజువైంది.

దీంతో మరో మాట లేకుండా వెంటనే అతనిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన తర్వాత ఆసుపత్రికి వెళ్లగా అక్కడ గమ్మత్తైన విషయం తెలిసింది. డేనీ కడుపులో మద్యం తయారవుతోందని వైద్యులు కనుగొన్నారు.

దీనిని ‘‘ ఆటో బ్రీవరీ సిండ్రోమ్’’ అంటారట. అతని పొట్టలోని కార్బోహైడ్రేట్లు వాటంతటవే ఆల్కహాల్‌గా మారుతున్నాయి. ముఖ్యంగా కేకులు, బ్రెడ్, పిజ్జాలు వంటి ఆహారాన్ని తీసుకున్నప్పుడు పొట్టలో ఆల్కహాల్ స్థాయి మరింత పెరుగుతోంది.

దీంతో అతను వాటిని మానేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు బదులుగా మాంసం, చేపలు, ఆకు కూరలు తీసుకుంటున్నాడు. ఈ వింత పరిస్థితిపై తనను పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ముందు షాకయ్యానని.. తాను మందు తాగలేదని ఎంత మొత్తుకున్నా వారు వినిపించుకోలేదు.

తాను మద్యం సేవించకపోయినా... చేయని నేరం కింద అరెస్ట్ చేస్తుండటంతో పిచ్చి పట్టినట్లయ్యిందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికీ తాను మద్యం సేవించలేదంటే ఎవరూ నమ్మరని, పైగా జోక్ చేస్తున్నా అనుకుంటారని డేనీ వాపోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios