Asianet News TeluguAsianet News Telugu

జానూ మేరీ జానూ.. అదరగొడుతున్న ట్రాఫిక్ పోలీస్ డ్యాన్స్.. వైరల్ వీడియో..

ఓ మధ్యవయస్కుడు అమితాబ్ పాటకు.. ఫుల్ జోష్ లో రోడ్డుమీద డ్యాన్స్ చేస్తున్నాడు. అక్కడికి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా సరదాగా అతడితో కలిసి స్టెప్పులేసి ఉత్సాహపరిచాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

man and traffic cop dancing to Janu Meri Jaan on the street video goes viral
Author
Hyderabad, First Published Apr 26, 2022, 10:30 AM IST

ఓ వ్యక్తి ట్రాఫిక్ పోలీసుతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమితాబ్ బచ్చన్, పర్వీన్ బాబీ పాట జాను మేరీ జాన్‌కి వీరిద్దరూ జంటగా నృత్యం చేస్తూ.. అలరించారు. ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంశు కబ్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోకి ఇప్పటికి దాదాపు 5 వేలమంది చూశారు. 

వీడియోలో, ఒక వ్యక్తి షాన్ సినిమాలోని పాట జాను మేరీ జాన్‌కు డ్యాన్స్ చేస్తూ ఆనందంతో ఊగిపోతుంటాడు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ట్రాఫిక్ పోలీస్.. ఆ అజ్ఞాత వ్యక్తితో కలిసి.. రోడ్డుపై డ్యాన్స్ చేశాడు. పాటకు తగ్గట్టుగా.. అతని స్టెప్పులకు తగ్గట్టుగా పాదాలు, చేతులు కదుపుతూ.. కాసేపు డ్యాన్స్ చేశాడు. దీన్ని అక్కడున్న వాళ్లు వీడియో తీశారు. ఈ వీడియోను షేర్ చేస్తే దీపాంశు కబ్రా “ఐసే పాల్ పబ్లిక్ పోలీస్ ఫ్రెండ్‌షిప్ కే ఖుబ్సూరత్ ఉదాహరన్ హై. #DancingCop #DancingWithCop (sic),” ఫ్రెండ్లీ పోలీసింగ్ కు ఇది నిదర్శనం అంటూ... పెట్టారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతో మంది ఈ పోస్టును షేర్ చేస్తున్నారు. కామెంట్ల వరద ప్రవహింపచేస్తున్నారు. ఇది చాలా బాగుంది, పోలీసులంటే ఇలా ఉండాలి, భలే డ్యాన్స్ చేస్తున్నారు.. అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios