Asianet News TeluguAsianet News Telugu

ఈ పిల్లికి ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చు.. చిన్నారి దృష్టి మళ్లించడానికి ఎంత క్యూట్ గా చేసిందో చూడండి....

పిల్లులు మనుషుల్లా చేయగలవని మీకు తెలుసా.. యాక్టింగ్ లో ఇరగదీస్తాయి. అలాంటి ఓ క్యూట్ వీడియో వైరల్ గా మారింది. 

Look how cat avoid babys attention at all costs, video goes viral - bsb
Author
First Published Sep 13, 2023, 9:11 AM IST

చిన్న పిల్లల చిలిపి అల్లరి భలే ముద్దుగా ఉంటుంది. అదే సమయంలో  ఇల్లు పీకి పందిరి వేసే వారి అల్లరి.. భరించడం కష్టంగానే ఉంటుంది. అప్పుడప్పుడే పాకడం నేర్చిన పిల్లలు ఏదో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందర వందర చేస్తుంటారు. ఇక అడుగులు వేయడం వచ్చిందంటే వారి అల్లరిని తట్టుకోలేం. బుడిబుడి అడుగులతో.. అందకుండా పరుగులు పెడుతూ ఇంట్లో మినీ రణరంగాన్ని సృష్టిస్తారు. 

వీరి అల్లరికి ఇంట్లోని పెంపుడు జంతువులు తోడయ్యాయంటే.. ఇక మాటల్లో వర్ణించలేం.. అలాంటి ఓ విచిత్రమైన, కామెడీ ఇన్సిడెంట్ ఒకరి ఇంట్లో జరిగింది. దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..  ఇంకేముంది ఆ వీడియో కాస్త వైరల్ గా మారింది. మామూలుగానే  సోషల్ మీడియాలో చిన్న పిల్లలు, పెంపుడు జంతువుల వీడియోలు వైరల్ అవుతుంటాయి.

‘భర్త కావాలి’ చేతిలో బోర్డుతో రోడ్డెక్కిన యువతి.. అరగంట తరువాత ఏం జరిగిందంటే..

ఇప్పుడు ఆ రెండు కలిపి ఒకే వీడియోలో ఉండడంతో మరింత వైరల్ గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. ఓ చిన్నారి అప్పుడప్పుడే బుడిబుడి అడుగులు వేస్తూ నడక నేర్చుకుంటున్నాడు.  వారింట్లో  ఓ పెంపుడు పిల్లి కూడా ఉంది. చిన్నారి అడుగులు వేస్తూ తన ఉయ్యాల దగ్గరికి వచ్చాడు. అప్పటికే.. పెంపుడు పిల్లి ఉయ్యాలలో పడకేసింది. 

చిన్నారి ఉయ్యాల దగ్గరికి వచ్చి.. ఊయలను పట్టుకొని అడుగులు వేస్తుండడంతో  అతను తనను ఉయ్యాలలో నుంచి ఎక్కడ తరిమేస్తాడోనని…ఆ పిల్లి  చిన్నారి దృష్టి మళ్లించడానికి చేసిన పని ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది. ఆ చిన్నారి దగ్గరికి వచ్చేసరికి.. పెంపుడు పిల్లి.. బొమ్మలాగా అలాగే ఉండిపోయింది. కాళ్లు, తోక ఏ మాత్రం కదపకుండా..కనురెప్పలు కూడా కొట్టకుండా.. స్టాచ్యులా మారిపోయింది.

దీంతో చిన్నారి దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకేముంది పిల్లి అనుకున్నది సాధించినట్టేగా… బాబు అడుగులని వీడియో తీస్తున్న… తండ్రి.. పిళ్లి చేష్టలకు ఆశ్చర్యపోయాడు.. ఆ వీడియోని సోషల్ మీడియాలో పెడుతూ.. ‘బాబు దృష్టిని మరలించడానికి మా పిల్లి ఏం చేసిందో చూడండి’.. అంటూ క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు నేటిజెన్లను తెగ ఆకర్షిస్తోంది. ‘ఈ పిల్లి నటనకు జాతీయ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం రెండు లక్షలకు పైగా లైకులతో దూసుకుపోతోంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios