పిల్లాడా.. మజాకా? ఇలా చేస్తే ఎన్ని చేపలైనా పట్టొచ్చు మరి.. తెగ వైరల్ అవుతున్న వీడియో..
చేపలు పట్టడం అంత సులువు కాదంటారు చాలా మంది. ఎందుకంటే చేపలు అంత సులువుగా పడవని. కానీ ఓ చిన్న పిల్లాడు మాత్రం ఎంత సులువుగా చేపలు పట్టాడో తెలిస్తే నోరెళ్లబెడతారు తెలుసా?
ఎవరి టాలెంట్ వాళ్లదే. వీళ్లు తక్కువ, వీళ్లు ఎక్కువ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒకరికున్న ప్రతిభ ఇంకొంకరి లేకపోవచ్చు. కానీ వాళ్లకు కూడా ఏదో ఒక టాలెంట్ తప్పకుండా ఉంటుంది. ఈ సంగతి పక్కన పెడితే ఇంటర్నెట్ లో ఒక వీడియో తెగ హల్ చల్ చేస్తుంది. ఈ పిల్లాడేంటి.. వీడికింత టాలెంట్ ఏంటి అంటూ జనాలు తెగ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ ఈ వీడియోలో అంతగా ఏముందబ్బా అనుకోవచ్చు. అయితే ఇందులో ఒక బాలుడు చేపలు పడతాడు. అందులో వింత ఏముందనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ పిల్లాడు చేపలు పట్టే టెక్నిక్ అందరిచే అదరహో అనిపిస్తుంది మరి.
ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోను ది బెస్ట్ అనే పేజ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ క్లిప్ లో ఓ చిన్న బాలుడు ఎక్కువ లోతు లేని చిన్న నీటి గుంట దగ్గరకు వెళతాడు. నీటి గుండ ఒడ్డున మాంజా ఉన్న రెండు చెక్క దుంగలను భూమిలో పాతుతాడు. ఆ తర్వాత పిండి ముద్దలు చేసి గాలానికి కట్టి దాన్నీ నీళ్లలో విసిరేస్తాడు.
ఆ తర్వాత ఓపిగ్గా ఒడ్డుకు కూర్చుంటాడు. కాసేపటికే మాంజా కదలడం మొదలవుతుంది. దీంతో ఆ బాలుడు ఆ గాలాన్ని ఒడ్డుకు లాగుతాడు. ఈ గాలానికి రెండు పెద్ద పెద్ద చేపలు కూడా వస్తాయి. చేపలను తన వెంట తెచ్చుకున్న సంచిలో వేస్తాడు. ఇది చూసేవాళ్లకు చిన్న విషయమే అయినా.. అంత చిన్నపిల్లాడు చేపలను ఇంత చాకచక్యంగా పట్టడం మాత్రం అద్బుతం. ఇది అందరిచే పిల్లాడు సూపర్ అనిపిస్తోంది.
'సంకల్పం + చాతుర్యం + సహనం = విజయం' అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగానే మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ బుడతడి నైపుణ్యానికి సోషమ్ మీడియా యూజర్లు తెగ ఫిదా అయ్యిపోయారు.