Asianet News TeluguAsianet News Telugu

చిన్నారిని ముద్దుచేసిన కేటీఆర్.. మంత్రి భుజంపై పడుకుని గారాలు పోయిన బుడ్డోడు..వీడియో వైరల్...

ఓ చిన్నారితో కేటీఆర్ ఆడుకున్న వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. లండన్ లోని ఈ వీడియోను పిల్లాడి తండ్రి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. 

ktr play with a small kid in london, video goes viral - bsb
Author
First Published May 17, 2023, 2:51 PM IST

హైదరాబాద్ : కేటీఆర్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తుంది. తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల కాలంలో లండన్ టూర్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించినదే ఈ వీడియో. ఇందులో ఓ చిన్నారిని కేటీఆర్ ఆడించడం.. ఆ చిన్నారి కూడా కేటీఆర్ దగ్గర బాగా అలవాటు ఉన్నట్లుగా ఉండిపోవడం.. ఆయన భుజంపై పడుకోవడం…గారాలు పోవడం.. అబ్బురంగా కనిపిస్తుంది.

ktr play with a small kid in london, video goes viral - bsb

ఇంతకీ ఆ చిన్నారి ఎవరంటే.. లండన్ లోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యూకే అధ్యక్షుడు, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కొడుకు. ఈ వీడియోను స్వయంగా రత్నాకరే ట్విట్టర్లో పోస్ట్ చేశారు. లండన్ టూర్ లో రత్నాకర్ ఇంటికి కేటీఆర్ వెళ్లారు. అప్పటిదే ఈ వీడియో. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ రత్నాకర్.. ‘దేవుడు మన ప్రార్థనలు విన్నప్పుడు కరుణిస్తాడు.. అలాంటి సమయాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి..’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు.

ప్రియమైన సోదరుడు, మంత్రి, డైనమిక్ లీడర్ కేటీఆర్ లండన్ లో తన ఇంటికి వచ్చినప్పుడు.. అలాంటి అద్భుతమే జరిగిందంటూ అన్నారు. రత్నాకర్ ఇంటికి వెళ్లిన కేటీఆర్ వారి కుటుంబంతో కాసేపు ముచ్చటించారు. ఆయన కొడుకు రణవ్ ను ఎత్తుకొని ఆడించారు. ఆ చిన్నారి కూడా కేటీఆర్ కు బాగా మాలిమి అయ్యాడు. ఆయన దగ్గర ఏడవకుండా చక్కగా ఉండడమే కాకుండా భుజంపై హాయిగా పడుకుని.. తాను చాలా కంఫర్ట్ గా ఉన్నట్టుగా  చెప్పకనే చెప్పాడు.

ఈ వీడియో పోస్ట్ ను మంత్రి కేటీఆర్ ఈరోజు రీ ట్వీట్ చేశారు. నిజంగా సంతోషకరమైన విషయం అని కేటీఆర్ కామెంట్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.


 

Follow Us:
Download App:
  • android
  • ios