అనుకోకుండా కొన్న లాటరీ.. అదృష్టం తెచ్చింది.. కొన్న గంటల్లోనే రూ.12 కోట్ల జాక్ పాట్...
సదానందన్ చాలాయేళ్లుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు. అయితే ఈ సారి మాత్రమే అతనికి జాక్ పాట్ వరించింది. సదానందన్ తన లాటరీ టికెట్ ను స్థానిక ఏజెంట్ సెల్వన్ నుంచి కొనుగోలు చేశారు. ఎన్నో యేళ్లుగా లాటరీలు కొంటున్నప్పటికీ తనకు జాక్ పాట్ తెచ్చిన లాటరీని కొనడం మాత్రం యాదృచ్ఛికంగానే జరిగిందట. రూ. 500లకు చిల్లర లేకపోవడంతో.. ఆ నోటును విడిపించడానికి లాటరీ టికెట్ కొన్నాడట.
కేరళ : Keralaకు చెందిన ఓ యాభై ఏళ్ళ Painter ను అదృష్టం వరించింది. bumper lottery రూపంలో ఏకంగా 12 కోట్ల రూపాయలను sadanandan అనే పెయింటర్ గెలుచుకున్నాడు. అయితే లాటరీ విజేతలను ప్రకటించే కొన్ని గంటల ముందే సదానందన్ లాటరీ కొనుగోలు చేయడం విశేషం.
కేరళలోని కొట్టాయంకు చెందిన ఓ పెయింటింగ్ కార్మికుడిని అదృష్టం లాటరీ రూపంలో వరించింది. కొట్టాయంలోని అయ్ మాననం ప్రాంతానికి చెందిన సదానందన్... Christmas and New Year సందర్భంగా నిర్వహించిన బంపర్ లాటరీ లో రూ. 12 కోట్లు గెలుచుకున్నాడు. లాటరీ కొన్న గంటల్లోపే రూ. 12 కోట్లు గెలుచుకోవడం విశేషం. అలా గంటల్లోనే అతడు కోటీశ్వరుడయ్యాడు.
అసలేం జరిగిందంటే…
సదానందం స్వస్థలం కేరళలోని కొట్టాయం కుడయంపాడు గ్రామం. ఆ ఊర్లో ఓ చిన్న ఇంట్లో నివసిస్తున్న సదానందన్ 50 ఏళ్లుగా పెయింటర్ గా పని చేస్తున్నాడు. బతకడానికి అనేక అప్పులు చేసిన క్రమంలో వాటిని తీర్చేందుకు ఓ లాటరి టికెట్ కొనాలని సదానందన్ నిర్ణయించుకున్నాడు. కొట్టాయంలోని బెంజ్ లాటరీస్ ఏజెన్సీకి చెందిన ఓ లాటరీ టికెట్ ను కొన్నాడు.
అయితే ఆ లాటరీ విజేతలను ప్రకటించడానికి కొన్ని గంటల ముందే సదానందన్ ఆ టిక్కెట్ కొనుగోలు చేయడం విశేషం. ఆదివారం ఉదయం ఇంట్లోకి నాన్ వెజ్ కొని తేవడం కోసం బయటకు వచ్చిన సదానందన్.. అదే సమయంలో ఆ లాటరీ టికెట్ (నెంబర్ XG 218582)కొన్నాడు. ఆ టికెట్ కొనుగోలు చేసి ఇంటికి వెళ్ళిన కొన్ని గంటల్లోనే సదానందం రూ.12 కోట్లు గెలుచుకున్నాడని తెలిసింది.
దీంతో తన తనకు అంత డబ్బు లాటరీ రూపంలో లభించడం వల్ల ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు సదానందన్. గత యాభై ఏళ్లుగా తాను పెయింటింగ్ వృత్తిలో ఉన్నట్లు తెలిపాడు. లాటరీలో గెలిచిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగించుకుంటానని చెప్పాడు.
లాటరీలో ఏకంగా రూ.12 కోట్లు గెలుచుకున్న కొట్టాయంలోని కుడయంపాడి నివాసి సదానందన్‌కు కొత్త సంవత్సరం ఎంతో అదృష్టాన్ని మోసుకొచ్చినట్టయ్యింది. దీంతో మీడియా అతన్ని చుట్టేస్తుంది. అతను మాట్లాడుతూ ఇన్నేళ్లుగా ఎన్నో కష్టాలు అనుభవించానని ఈ లాటరీ మొత్తాన్ని తన పిల్లల భవిష్యత్తు కోసం వినియోగిస్తానని సోమవారం తెలిపాడు.
సదానందన్ చాలా సంవత్సరాలుగా లాటరీ టిక్కెట్లు కొంటున్నాడు, అయితే ఈసారి మాత్రమే అతనికి జాక్‌పాట్ దక్కింది. సదానందన్ తన లాటరీ టికెట్‌ను స్థానిక ఏజెంట్ సెల్వన్ నుండి కొనుగోలు చేశాడు. ఎన్నో యేళ్లుగా లాటరీలు కొంటున్నప్పటికీ తనకు జాక్ పాట్ తెచ్చిన లాటరీని కొనడం మాత్రం యాదృచ్ఛికంగా జరిగిందట. రూ. 500లకు చిల్లర లేకపోవడంతో.. ఆ నోటు విడిపించడానికి లాటరీ టికెట్ కొన్నాడట.
అదే తనకు గంటల్లోనే అదృష్టాన్ని తెచ్చిపెడుతుందని ఊహించలేదని చెబుతున్నాడు సదానందన్. ముందుగా ఈ డబ్బులు అప్పులు తీర్చేసి.. సొంత ఇల్లు నిర్మించుకుని.. మిగిలిన మొత్తాన్ని పిల్లల భవిష్యత్తుకోసం ఖర్చుచేస్తానని చెప్పుకొచ్చాడు సదానందన్. ఈ గెలుపుపై ఆయన ఇద్దరు కుమారులు సనీష్, సంజయ్, భార్య రాజమ్మలు చాలా సంతోషంగా ఉన్నారు.