ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఓ వృద్ధుడి పాట.. ఆ పాటలో ఏ మహత్యం ఉందంటే...
ఓ వృద్ధుడు ఓ పంజాబీ పాట పాడుతున్న వీడియోను పర్వీన్ కస్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేశారు. అతని మనోహరమైన స్వరానికి ఇంటర్నెట్ ఫిదా అయ్యింది.
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలియదు. పెంపుడు జంతువులు, చిన్నపిల్లల వీడియోలు వైరల్ అవుతాయని కాస్త గెస్ చేయచ్చు.. కానీ అసాధారణంగా ఓ పెద్దవయసు వ్యక్తి పాడిన ఓ పాట వైరల్ అయింది. అతను పాత పంజాబీ పాట ‘జిదా దిల్ తుట్ జాయే’ను బిందెమీద దరువు వేస్తూ పాడాడు. ఈ పాటను మొదట నూర్ జెహాన్ పాడారు. ఆమెను అనుకరిస్తూ.. నేపథ్య సంగీతం కొరకు తన చేతిలోని అల్యూమినియం బిందెను వాడుతూ.. దరువు వేయడం అందర్నీ అబ్బురపరుస్తుంది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.
“ఎంత అందమైన పాట... మీరు పంజాబీ అర్థం అవుతే.. ఈ పాట ఎంతో సరళమైనది, సొగసైనదని తెలుస్తుంది ”అని వీడియో క్యాప్షన్ పెట్టారు. పాట పాడిన వృద్ధుని స్వరం కూడా ఎంతో బాగుంది. పాటకు తగ్గట్టుగా ఆయన హావభావాలు, పాటలో హెచ్చుతగ్గులు.. అద్భుతంగా ఉంది నెటిజన్ల మనసు దోచుకుంది.
“రాగం, లయ ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ఆ పెద్దమనిషి పంజాబీ జానపద సంగీతాన్ని నిజంగా శ్రవణేందద్రియాలకు వినసొంపుగా పాడాడు”అని ఒక నెటిజన్ ప్రశంసించగా.. “పూర్తిగా అద్భుతమైన గానం. శ్రావ్యమైన సాహిత్యాన్ని, అందులోని అందాన్ని... సరళమైన పాత్ర లయను.. సంగీతాన్ని వాయించడానికి బిందెను.. ఉపయోగించడం బాగుంది. హృదయ స్పందనకు..ప్రేమ కథలకు భాష అడ్డంకి కాదు. ఎంత అద్భుతమైన సెట్టింగ్. పొలాల్లో కాకుండా, బ్యాక్‌గ్రౌండ్‌లో బండ్ల వెళ్లడం బాగుంది” అని మరొకరు అన్నారు. ఇలా అనేక రకాల కామెంట్స్ తో నెటిజన్లు ఆ వృద్ధుడిని మెచ్చుుంటున్నారు.