ఎత్తైన భవనం మీద కూర్చొని ఇద్దరు దంపతులు ఘాటైన రొమాన్స్ లో మునిగి తేలారు. కాగా.. అక్కడితో ఆగకుండా.. వాటిని మరింత అందంగా కెమేరాలో బంధించారు. అంత చక్కగా వచ్చిన రొమాంటిక్ ఫోటోలను తమ ఫోన్ లో దాచుకుంటే ఏమి వస్తది..? అందుకే.. వాటిని తీసుకెళ్లి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే అలా ఫోటోలు దిగి పెడతారా అంటూ ఆ దంపతులను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సంఘటన ఇరాన్ లో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఎత్తైన భవనంపై తన స్టంట్‌ భాగస్వామిని ముద్దు పెట్టుకున్న ఫొటోలను  ప్రముఖ పార్కుర్ అథ్లెట్ అలిరెజా జపాలాఘీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

దీంతో.. ఆ ఫోటోలపై వివాదం మొదలైంది. ఫోటోలు వైరల్ కావడంతో.. వారిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. షరియా చట్టం నిబంధనలు ఉల్లఘించి బహిరంగ ప్రదేశాల్లో అసభ్యంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో వీరిని అరెస్ట్‌ చేసినట్టు టెహ్రాన్‌ పోలీసు చీఫ్‌ హుస్సేన్ రహీమి ధ్రువీకరించారు.

అయితే అలిరెజా జపాలాఘీ గతంలో ఇలాంటి ఫోటోలను గతంలో కూడా పోస్టు చేశాడు. అయితే.. అప్పుడు అరెస్టు చేయకుండా ఇప్పుడెందుకు చేస్తున్నారంటూ నెటిజన్లు ప్రశ్నించడం గమనార్హం.

సదరు రొమాంటిక్ అథ్లెట్స్ కి నెటిజన్లు అనూహ్యంగా మద్దతు పలికారు. అలిరెజా అద్భుతమైన ఫొటోలకు అవార్డు ఇవ్వాలి కానీ అరెస్ట్ చేయకూడదు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేయడం విశేషం.