కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా వణికించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మహమ్మారి కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఈ వైరస్ కి మందు కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు, పరిశోధకులు చేయని ప్రయత్నమంటూ లేదు. ఇప్పటికీ  ఈ వైరస్ కి ఇదీ మందు అని చెప్పుకోలేకపోతున్నాం. ఇంకా వ్యాక్సిన్ ప్రయోగాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఓ 14ఏళ్ల బాలిక అద్భుతమైన థెరపీని సృష్టించింది. 

కరోనాకి చెక్ పెట్టేందుకు  ఆమె తయారు చేసిన థెరపీని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సదరు బాలికపై అనికా చేబ్రోలు కాగా.. ఆమె భారత సంతతికి చెందిన బాలిక కావడం గమనార్హం. టెక్సాస్‌లోని ప్రిస్కోలో నివసిస్తున్న 14 ఏళ్ల అనికా చేబ్రోలు.. 2020 3M యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ గెలిచి.. రూ.18 లక్షలకు పైగా ప్రైజ్ మనీ గెలుచుకుంది. కరోనా వైరస్ ఉపరితలంపై ఉండే కొవ్వును కట్టడి చేసే ప్రధాన మాలిక్యూల్‌ను ఆమె కనిపెట్టింది.

8వ తరగతి చదువుతున్న అనిక.. తన పరిశోధన కోసం ఆమె రకరకాల వైరస్‌లు, వ్యాధులను అధ్యయనం చేసింది. ఏయే వ్యాధులపై ఏ మందులు ఏలా పనిచేస్తాయో తెలుసుకుంది. ఆ దిశగా తన పరిశోధనలు ప్రారంభించింది. కరోనా అంతు చూసేందుకు తన వంతు కృషి చేసి విజయం సాధించింది. అనికా చురుకైన అమ్మాయి.. ఈ ప్రాజెక్ట్‌పై ఎన్నో ప్రశ్నలు వేసి సమాచారాన్ని సేకరించింది.. శక్తివంతమైన థెరపీకి రూపకల్పన చేసింది అని ఫ్రైజ్ మనీ ఛాలెంజ్‌కి జడ్జిగా వ్యవహరించిన డాక్టర్ సిండీ మాస్ తెలిపారు. అనికా రూపొందించిన థెరపీ ద్వారా కరోనా రోగులకు మేలు కలగనుంది అని వివరించారు.

తాను అభివృద్ధి చేసిన ఈ అణువు సార్స్ కరోనా వైరస్ పై ఒక నిర్దిష్ట ప్రోటీన్ ను నిలువరిస్తుందని అనిక చేబ్రోలు తెలిపింది. ఈ ప్రొటీన్ను బంధించడం ద్వారా ఇది వైరస్ ప్రోటీన్ పనితీరును ఆపివేస్తుందని దీన్ని తాను 682 మిలియన్ కాంపౌండ్ల డేటాబేస్ తో ప్రారంభించానని తెలిపింది అనికా. కరోనా రోజులు పోయి… సాధారణ రోజులు రావాలని..ప్రజలు స్వేచ్చగా ఎటువంటి భయం లేకుండా సాధారణ రోజులు గడపాలనుకోరుకుంటున్నానని అనికా మీడియాకు తెలిపింది.