రిపోర్టర్ గా మారిన చిన్నారి.. రోడ్ల అద్వాన్న పరిస్థితిని వివరిస్తూ..!

ఆ వీడియోలొ చిన్నారి.. పింక్ జాకెట్ ధరించి ఉంది.. కశ్మీర్ లోని తాము ఉంటున్న ప్రాంతంలో.. రోడ్లు.. సరిగా లేవని.. దాని కారణంగా..  అతిథులు.. ఆ ప్రదేశానికి రాలేకపోతున్నారని.. ఆ చిన్నారి వీడియోలో వివరించడం విశేషం.

Girl Turns Reporter To Show Bad Condition Of Kashmir Roads

తమ ప్రాంతంలో రోడ్లు ఎంత అద్వాన్నంగా  ఉన్నాయో తెలియజేసేందుకు.. ఓ చిన్నారి రిపోర్టర్ గా మారింది. ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అనే క్లారిటీ లేదు కానీ.. ప్రస్తుతం వీడియో మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. కశ్మీర్ కి చెందిన ఈ చిన్నారిపై ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రశంల వర్షం కురుస్తోంది. ఇంత చిన్న వయసులో ఎంత చక్కగా మాట్లాడింది అంటూ.. ప్రశంసిస్తున్నారు.

ఆ వీడియోలొ చిన్నారి.. పింక్ జాకెట్ ధరించి ఉంది.. కశ్మీర్ లోని తాము ఉంటున్న ప్రాంతంలో.. రోడ్లు.. సరిగా లేవని.. దాని కారణంగా..  అతిథులు.. ఆ ప్రదేశానికి రాలేకపోతున్నారని.. ఆ చిన్నారి వీడియోలో వివరించడం విశేషం.

కాగా.. కశ్మీర్ వ్యాలీ నుంచి అతి పిన్న వయస్కురాలైన రిపోర్టర్ ని కలుసుకోండి. అంటూ.. చిన్నారి వీడియోను  ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ గా మారింది. ఆ రోడ్డులోని గుంతలను కెమేరాతో చూపించని.. ఆ చిన్నారి వాళ్ల ఆమెకు చెప్పడం కూడా.. వీడియోలో తెలుస్తోంది.

కాశ్మీర్ లోయలో ఇటీవల భారీ మంచు, వర్షం కురిసింది. ఆ వర్షం దాటికి బురద పేరుకుపోయి.. రోడ్లు ఎంత అధ్వాన్నంగా మారాయో వివరిస్తూ.. ఆ చిన్నారి 2 నిమిషాల వీడియోని చిత్రీకరించింది. మొబైల్ ఫోన్ లో ఈ వీడియో తీసింది. తాను నడుచుకుంటూ  రోడ్డు మీద గుంతలను చూపించింది.  రోడ్డుపై ప్రజలు చెత్త కూడా వేస్తున్నారని..  ఆమె ఆ వీడియోలో చూపించడం గమనార్హం.

 

తన వీడియో చూసిన తర్వాత.. లైక్, కామెంట్, సబ్ స్క్రైబ్ చేయండి అంటూ.. ఆ చిన్నారి చివర్లో పేర్కొనడం గమనార్హం. తర్వాతి వీడియోలో మళ్లీ కలుస్తానంటూ..  చెప్పి వీడియోని ముగించింది.

ఈ వీడియోని కొన్ని వేల మంది ట్విట్టర్ లో షేర్ చేశారు. లక్షల మంది వీక్షించారు. కాగా.. చిన్నారి గతంలోనూ ఇలాంటి వీడియోలు  చేయడం గమనార్హం. ఇప్పుడు రోడ్ల పరిస్థితి వివరించగా.. గతంలో.. ఆన్ లైన్ విద్య గురించి అధికారుల సహాయం కోరింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios