Asianet News TeluguAsianet News Telugu

ఓమిక్రాన్ పై 1963లోనే సినిమా తీశారా..? నిజమేనా..?

ఈ ఒమిక్రాన్ భారత్ లోనూ అడుగుపెట్టింది. గురువారం.. రెండు ఓమిక్రాన్ కేసులను గుర్తించారు కూడా. కాగా.. దీంతో.. ఈ వేరింట్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా కూడా మారింది.
 

fact Check: Was There a 1963 movie called The Omicron Variant
Author
Hyderabad, First Published Dec 3, 2021, 1:58 PM IST

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. ఇప్పటికే కరోనా మొదటి వేవ్, సెకండ్ వేవ్ చాలా మంది ప్రాణాలను హరించింది. ఈ కరోనా భయం నుంచి ఇప్పటి వరకు కోలుకోక ముందే.. ఈ మహమ్మారి మరో వేరియంట్ రూపంలో  ఎటాక్ చేయడం మొదలుపెట్టింది. దక్షిణాఫ్రికాలో ఇప్పటికే కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ప్రకంపనలు సృష్టించడం మొదలుపెట్టింది.

ఈ ఒమిక్రాన్ భారత్ లోనూ అడుగుపెట్టింది. గురువారం.. రెండు ఓమిక్రాన్ కేసులను గుర్తించారు కూడా. కాగా.. దీంతో.. ఈ వేరింట్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండింగ్ గా కూడా మారింది.

ఈ నేపథ్యంలో... ఈ మధ్య, “ది ఓమిక్రాన్ వేరియంట్” అనే టైటిల్‌తో కూడిన చిత్రానికి సంబంధించిన స్పష్టమైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘భూమిని శ్మశానవాటికగా మార్చిన రోజు’ అని పోస్టర్‌పై ట్యాగ్‌లైన్ ఉంది. ఈ సినిమా 1963లో విడుదలైందని అంటున్నారు.


దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా “నమ్మండి లేదా మూర్ఛపోండి..ఈ చిత్రం 1963లో వచ్చింది .. ట్యాగ్‌లైన్‌ని తనిఖీ చేయండి” అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను పంచుకున్నారు. 

అయితే.. చాలా మంది ఈ సినిమా పోస్టర్ నిజమని నమ్మేశారు. అయితే.. అది నిజం కాదని తేలింది.  1974 నాటి “ఫేజ్ IV” అనే చిత్రం  పోస్టర్‌ను ఎడిట్  చేసి.. ఈ పోస్టర్ ని విడుదల చేసినట్లు తేలింది.  బెక్కీ చీటిల్, ఒక ఐరిష్ దర్శకుడు , రచయిత, కేవలం వినోదం కోసం వైరల్ పోస్టర్‌ను రూపొందించారు. "ది ఓమిక్రాన్ వేరియంట్" పేరుతో సినిమా లేదు అని తేలింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios