బాబోయ్.. రోడ్డు మీద హాఠాత్తుగా ప్రత్యక్షమైన ఏనుగుల గుంపు.. ఆ బైకర్స్ ఎలా తప్పించుకున్నారంటే..
ఏనుగుల గుంపు మధ్యలో ఇరుక్కుపోయిన బైకర్లు.. తృటిలో ప్రాణాపాయంనుంచి తప్పించుకున్నారు. ఈ భయానక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.
బెంగాల్ : బెంగాల్‌లోని ఉత్తరప్రాంతంలో ఉన్న సిలిగురిలోని ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. అడవిలో వెడుతుండగా కొంతమంది బైకర్స్ కు ఏనుగుల గుంపు ఎదురయ్యింది. తృటిలో వారికి చావుతప్పి కన్ను లొట్టపోయినంత పనయ్యింది. లేకపోతే ఆ ఏనుగుల పాదాల కింద నలిగి క్షణాల్లో పరలోకానికి చేరుకునేవారు. ఆ వీడియో చూసినవారందరికీ ఒక్కసారిగా వెన్నులో జలదరింపు కలిగించేలా ఉంది.
ఈ భయానక వీడియో ఈ కారణంతోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర బెంగాల్‌లోని సుక్నా అనే గ్రామంలోని రోడ్డు మీద కారులో, బైక్ మీద కొంతమంది వెడుతుండగా ఏనుగుల గుంపు హఠాత్తుగా ప్రత్యక్షమయ్యింది. ఆ గుంపు రోడ్డు దాటుతోంది. కారు ముందు వెళ్లిపోగా.. బైకర్లు కనురెప్ప పాటులో వాటినుంచి తప్పించుకున్నారు. వాటిని చూసిన బైకర్లు.. స్పీడ్ గా తోలి...కిందపడిపోయారు. వెనక కూర్చున్న వ్యక్తి వెంటనే లేచి, ముందు వ్యక్తిన పట్టుకుని కాస్త దూరం పరిగెత్తాడు. ఏనుగులు మాత్రం తమకేమీ తెలియదన్నట్లుగా హాయిగా రోడ్డుకు ఆ వైపు నుంచి ఈ వైపుకు దాటి వెళ్లి పోయాయి. ఈ దృశ్యాలే వీడియోలో కనిపిస్తున్నాయి.
ఢిల్లీ మెట్రోలో వ్యక్తి హస్తప్రయోగం.. ఫొటో రిలీజ్ చేసిన పోలీసులు..
ఈ ఏనుగుల గుంపులో గున్నఏనుగులతో పాటు, పెద్ద ఏనుగులు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో వాటిని చూసినప్పుడు బైకర్‌తో పాటు పిలియన్ రైడ్ చేస్తున్న వ్యక్తి కళ్ళలో భయాన్ని చూడవచ్చు. ఈ భయానక పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై నుంచి కిందపడిపోయారు. ఏనుగుల కారిడార్ కావడంతో ఈ రహదారి గుండా వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరుతున్నారు. ఈ ఘటన మంగళవారం చోటుచేసుకుంది.